»   » 50 రోజుల 'శ్రీమంతుడు': గల్లా జయదేవ్‌ శుభాకాంక్షలు

50 రోజుల 'శ్రీమంతుడు': గల్లా జయదేవ్‌ శుభాకాంక్షలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'శ్రీమంతుడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర హీరో మహేశ్‌బాబుకు, దర్శకుడు కొరటాల శివకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.


ఆగస్టు 7న విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కోటీశ్వరుడైన ఓ వ్యక్తి గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై ఈ చిత్రం కథ ఆధారపడి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేపథ్యంలో గ్రామాల దత్తత కార్యక్రమం వూపందుకున్న విషయం తెలిసిందే.


మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం 185 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది.


Galla Jayadev tweet about Srimanthudu

మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.


English summary
Jay Galla ‏tweeted: 'Its becoming a Movement that will outlive the Movie.. Congrats to Superstar Mahesh, Koritala Siva & entire Team... '
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu