twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వసూళ్లు చూపించి డబ్బా కొట్టడు పవన్: గణేష్

    By Srikanya
    |

    వసూళ్లు చూపించి డబ్బా కొట్టుకునే తత్వం కాదు ఆయనది. ఈ సినిమా వసూళ్ల వివరాలు బయటపెట్టడం పవన్‌కళ్యాణ్‌కి ఇష్టం లేదు. పవర్‌స్టార్ ఓ సెపరేట్ పీస్. వందేళ్లకు ఒకసారే అలాంటి పీస్ తయారవుతుంది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా సాధించని వసూళ్లను 'గబ్బర్‌ సింగ్' సాధించిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను అన్నారు నిర్మాత గణేష్ బాబు. ఆయన తన తాజా చిత్రం 'గబ్బర్‌ సింగ్'గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే పవన్‌ కళ్యాణ్ నన్ను నిర్మాతను చేశారు. భవిష్యత్తులోనూ ఆయనతో సినిమాలు తీస్తూనే ఉంటాను. నిజానికి ఈ సినిమా పవన్‌ సొంత నిర్మాణ సంస్థతో తీయాల్సింది. 'తీన్‌మార్‌' ఫలితం నిరాశ కలిగించడంతో నన్ను ఆదుకోవాలని పవన్‌ ఈ సినిమా బాధ్యత నాకు అప్పగించారు. పవన్‌తోనే కాదు, స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు తీస్తాను అని చెప్పారు. దక్షిణభారత చలనచిత్ర చరిత్రలోనే 'గబ్బర్‌ సింగ్' ఓ నూతన అధ్యాయాన్ని సృష్టించిందని గణేష్ ఆనందం వ్యక్తం చేశారు.

    ఇక 'గబ్బర్‌ సింగ్' రిజల్ట్ తెలియగానే ఆనందం తట్టుకోలేక పవన్‌ కళ్యాణ్ ఇంటికెళ్లాం. అప్పటికే సినిమా రిజల్ట్ తెలుసుకున్నారాయన. కానీ అదేం పట్టించుకోకుండా పెరట్లో చెట్లకు నీళ్లు పోస్తూ కనిపించారు. ఎదిగేకొద్దీ ఒదిగుండే అలాంటి లక్షణం కొద్దిమందికే ఉంటుంది. దటీజ్ పవర్‌స్టార్ అని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.

    పైరసీని అరికట్టడం చాలా కష్టమైపోయింది. దీన్ని ఆపాలంటే అభిమాలనులందరూ కలిసికట్టుగా పోరాడాలి. పాటలపై లాభాలను సంగీత దర్శకులు, గీతరచయితలకే పంచి పెట్టాలని చెబుతున్నారు. బాగానే ఉంది... కానీ నష్టాలొస్తే వాళ్లు భరించడానికి సిద్ధమా అని గణేష్ ప్రశ్నించారు.

    ఐపీఎల్ ప్రభావం 'గబ్బర్‌ సింగ్'పై పడుతుందని అందరూ భావించారు. కానీ 'గబ్బర్‌ సింగ్' ప్రభావమే ఐపీఎల్‌పై పడింది. ఈ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ సినిమారంగం విస్తుపోయింది. నా దృష్టిలో ఇంతటి సంచలనం ఒక రజనీకాంత్, ఒక పవన్‌కళ్యాణ్‌లకు మాత్రమే సాధ్యం'' అన్నారు. రజనీకాంత్, సల్మాన్‌ఖాన్ లాంటి వాళ్లు ఈ సినిమా చూసి ప్రశంసించారని గణేష్ గర్వంగా చెప్పారు.

    English summary
    Ganesh says that... Gabbar Singh has received tremendous response and breaking all the previous records in the Tollywood film industry. All multiplexes and cinema halls are running full with 100% occupancy all over India and also have got good responses in the shows shown abroad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X