»   » పవన్ కళ్యాణ్ తీన్ మార్ పై డౌటేలేదు ధీమా వ్యక్తం చేస్తున్న గణేష్...

పవన్ కళ్యాణ్ తీన్ మార్ పై డౌటేలేదు ధీమా వ్యక్తం చేస్తున్న గణేష్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ గత సినిమా 'పులి" విడుదల తేదీలు ఎన్ని మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీరా ఈ సినిమా విడుదలయిన తర్వాత ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'తీన్ మార్" చిత్రం విడుదల తేదీ కూడా పవన్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందట. దీనికి కారణం వచ్చే నెల రెండో వారంలో సినిమాని విడుదల చేస్తామని నిర్మాత అంటున్నాడుగానీ..ఇప్పటివరకూ కన్ఫార్మ్ డేట్ చెప్పడంలేదు. ఆడియో తేదీ కూడా ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.

ఇక ఈ సినిమా పబ్లిసిటీని వెరైటీగా ప్లాన్ చేస్తున్నానని చెబుతోన్న గణేష్, పవన్ కెరీర్ లోనే 'తీన్ మార్" ది బెస్ట్ ఫిలిం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే అసలు అనుకున్న టైమ్ కి 'తీన్ మార్" విడుదలవుతుందా? లేదా అని అభిమానులకు సందేహం కలుగుతోందని, దీనివల్ల చాలా నిరాశకు గురవుతున్నారని సమాచారం. ఈ సినిమాలో 'లార్డ్ శివ మీద ఈ చిత్రంలో ఓ పాట ఉంటుందట. ఈ పాటను విన్నవాళ్ళు ఖచ్చితంగా చిరంజీవి గారి 'ఇంద్ర" సినిమాలోని 'బమ్ బమ్ బోలే" పాటను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా రెండు పాటల చిత్రీకరణ జరగాల్సివుంది. జయంత్ లాంటి దర్శకుడిని పెట్టుకుని నిర్మాత విడుదల తేదీని కన్ఫార్మ్ గా చెప్పకపోవడం అభిమానులను కంగారుకు గురి చేస్తోందట.

English summary
Speaking about Teen Maar's progress producer Ganesh Babu says, “Mani Sharma has scored a brilliant song on Lord Shiva in the film which was canned superbly at Kasi. The mega fans will enjoy the number and recalls ‘Bham Bham Bhole….’ track in Chiranjeevi’s Indra movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu