Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'గోపాల గోపాల' పై ఫిర్యాదు, ప్రోమోపై క్రిమినల్ కేసు (ఫోటోస్)
హైదరాబాద్: సినిమా రంగాన్ని ఉపయోగించుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఒక పథకం ప్రకారం జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర. సినిమాటోగ్రఫీ చట్టంలోని లొసుగులను, సెన్సార్ బోర్డులో తిష్టవేసిన అవినీతిని ఆసరాగా చేసుకుని, స్వేచ్ఛ పేరుతో, వినోదం పేరుతో హిందువుల దేవ దేవతలను, భారతీయ విలువలను దెబ్బతీసే విధంగా సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలను వెంటనే నిషేదించాలని, వాటి ప్రదర్శనకు అనుమతులు ఇవ్వకూడదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది.
దీనిపై వారు మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రం ప్రోమో ఇటీవల టీవీ చానల్స్ లో ప్రసారం అయింది. శ్రీకృష్ణుని వేషధారణతో అసభ్యంగా నాట్యాలు చేస్తూ, వినోదం కోసం దేవుళ్ల వేషధారణ వేయడంపై ఈ రోజు సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసాం. ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని, ఈ చిత్రం ప్రివ్యూ కూడా వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది' అని తెలిపారు.
ఫిర్యాదుపై స్పందించిన రీజనల్ అధికారి, ఈ చిత్ర ప్రమోకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, వెంటనే క్రమినల్ కేసులు నమోదు చేయడానికి పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేస్తానని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉంటే ఈ చిత్ర విడుదల ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని...భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు తెలిపారు.
సినిమా రంగం హిందువుల మనోభావాలు గౌరవించేలా ప్రవర్తించాలి. లేకుంటే తగిన గుణపాఠం చెప్పాల్సివస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంటూ....భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, కార్యదర్శి రావినూతల శశిధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఫిర్యాదు చేస్తున్న దృశ్యం
సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు.

ప్రెస్ నోట్
సెన్సార్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఫిర్యాదు వివరాలను వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రెస్ నోట్.

ఫిర్యాదు కాపీ
ఫిర్యాదు కాపీని మీడియాకు విడుదల చేసారు.

పికె ఎఫెక్ట్
ఓ వైపు పికె సినిమాపై వివాదం తారస్థాయిలో రేగుతున్న నేపథ్యంలో.....‘గోపాల గోపాల' చిత్రంపై కూడా ఆందోళన కారులు దృష్టి సారించారు.