»   » రాఘవ లారెన్స్ ‘గంగ’...బాలయ్యతో ఢీ!

రాఘవ లారెన్స్ ‘గంగ’...బాలయ్యతో ఢీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగ' చిత్రం ఈ నెల 17న విడుదల కావాల్సి ఉండగా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో విడుదల ఆగిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు బాలయ్య నటించిన ‘లయన్' చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండటం గమనార్హం.

ఈ చిత్రం తమిళంలో ‘కాంచన-2'గా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది.


తెలుగులో ఈ చిత్రం విడుదల ఆగిపోవడానికి కారణం...నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పులే కారణమని అంటున్నారు. బెల్లంకొండ సురేష్ గత సినిమాలు అల్లుడు శ్రీను, రభస భారీ నష్టాలు మిగిల్చాయి. ఆయా సినిమాలకు సంబంధించిన అప్పులు బెల్లంకొండ ఇంకా క్లియర్ చేయలేదట. దీంతో తమ అప్పుల విషయం తేలిస్తేగానీ ‘గంగా' సినిమాను విడుదల కానివ్వమంటూ కూర్చున్నారట ఫైనాన్షియర్లు. సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లతో అప్పుత తీరుస్తానని అంటున్నాడట బెల్లంకొండ. అయితే గ్యారంటీ ఇవ్వనిదే ససేమిరా అంటున్నారట ఫైనాన్షియర్లు. మొత్తానికి సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో ‘గంగ' విడుదల కోసం ఎదురు చూస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.


Ganga release on May 1st

సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Raghava Lawrence’s forthcoming film ‘Ganga’ (Muni 3) has been creating a lot of buzz recently. Bellamkonda Suresh is producing the Telugu version which is slated for a May 1st release.
Please Wait while comments are loading...