Don't Miss!
- News
Hyderabad: హానీమూన్ కోసం వెళ్లి.. గుండె పోటుతో మృతి చెందిన సాఫ్ట్ వేరు ఉద్యోగి..
- Finance
Spicejet: రిపబ్లిక్ డే సేల్.. విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపులు.. నాలుగు రోజులే ఛాన్స్..
- Sports
IND vs NZ:టామ్ లాథమ్ వికెట్ కోహ్లీ ఐడియానే.. ఉచ్చు బిగించి ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్!
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
- Lifestyle
డ్రై స్కిన్ మరియు స్కిన్ ఇచ్చింగ్ నివారణకు ఆయుర్వేదంలో సులభ చిట్కాలు
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
నాగార్జున ఫోన్ చేస్తే తిట్టేసిన గంగవ్వ: అఖిల్ పెళ్లి, చైతూ పిల్లల సంగతి ఏమైంది అంటూ.. చివరికి ఎమోషనల్!
బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో గంగవ్వ ఒకరు. ఒక విధంగా గంగవ్వ రావడం వలన బిగ్ బాస్ కు మొదట్లో మంచి రేటింగ్ వచ్చిందనే చెప్పాలి. అయితే ఆమె వెళ్ళిపోయాక మాత్రం చాలా మంది అప్సెట్ అయ్యారు. ఇక రానురాను గంగవ్వకున్న క్రేజ్ అమాంతంగా పెరిగిపోతోంది. అయితే ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియోలో నాగార్జున ఫోన్ చేస్తే గంగవ్వ తిట్టేసింది. అంతే కాకుండా అఖిల్ పెళ్లి గురించి, చైతన్య సమంతలకు పిల్లలు కాలేరా అంటూ అడిగేసింది.

యూ ట్యూబ్ స్టార్ గా..
గంగవ్వ బిగ్ బాస్ కంటే ముందే యూ ట్యూబ్ స్టార్ గా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంది. మై విలేజ్ షో యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా సెలబ్రెటీగా మారిపోయిన గంగవ్వ ఎలాంటి వీడియో చేసినా కూడా వైరల్ అవ్వాల్సిందే. యూత్ లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.

హీరోలతో ఇంటర్వ్యూలు
ఒకవైపు సినిమాలు మరోవైపు యూ ట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బిజీ అవుతున్న గంగవ్వ అప్పుడప్పుడు స్టార్ హీరోలను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది. ఇక రీసెంట్ గా నితిన్, నాగార్జునలతో కూడా గంగవ్వ స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసిన వీడియోలు ట్రెండ్ లిస్ట్ లోకి వచ్చేశాయి.

నాగార్జునను తిట్టేసిన గంగవ్వ
అయితే నాగార్జునతో చేసిన ఇంటర్వ్యూ వీడియోలో గంగవ్వ మొదట్లో నాగార్జునను తిట్టేసింది. నాగ్ పేరుతో ఎవరెవరో ఫోన్ చేయడంతో విసిగిపోయిన గంగవ్వ ఫైనల్ గా హీరోనే చేయడంతో గుర్తుపట్టలేక గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కామెడీ స్కిట్ లో భాగంగా చేసిన ఈ వీడియో నెటిజన్లును అమితంగా ఆకట్టుకుంటోంది.

స్పెషల్ ఇంటర్వ్యూ
నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నాగార్జున స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో గంగవ్వ నాగార్జునను అనేక రకాల ప్రశ్నలు అడిగింది. అదే విధంగా బిగ్ బాస్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇద్దరు నవ్వుకున్నారు.

అఖిల్ కు పిల్లను చూస్తా..
ఇక నాగార్జున పర్సనల్ ఫ్యామిలీ విషయాలని అడిగిన గంగవ్వ అఖిల్ పెళ్లి గురించి కూడా అడిగేసింది. అయితే కొడుకుకే ఆ నిర్ణయాన్ని వదిలేసినట్లు చెబుతూ ఇష్టమైన వాళ్ళను పెళ్లి చేసుకోమ్మని అన్నట్లు నాగార్జున వివరణ ఇచ్చారు. అయితే మా ఊర్లో చాలా మంది పిల్లలు ఉన్నారు చూడమంటారా? అంటూ గంగవ్వ సరదాగా కామెంట్ చేసి నాగార్జునను నవ్వించింది.
Recommended Video

చివరికి ఎమోషనల్
ఇక ఫైనల్ గా చైతన్య - సమంతలకు ఇంకా పిల్లలు కాలేదా అని గంగవ్వ అడిగేసింది. నేను కూడా వాళ్ళను అడుగుతున్నాను. నాకు మనవాళ్ళు కావాలని అంటూ నాగార్జున సమాధానం ఇచ్చారు. ఇక వైల్డ్ డాగ్ చిత్ర విశేషాలను చెప్పిన నాగార్జున చిత్ర నగినటులను గంగవ్వకు పరిచయం చేశాడు. ఇక చివరలో గంగవ్వ తన ఇంటి పని పూర్తయినట్లు చెప్పడంతో నాగార్జున ఎమోషనల్ అయ్యారు.