సినీ నటుడు నరేష్‌ ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలెండర్

By Srikanya

హిందూపురం : సినీ నటుడు నరేష్‌ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగసి.. ఆ కారణంగా గ్యాస్‌ సిలెండర్ పేలింది. రెండు కంప్యూటర్లు, ఒక యూపీఎస్‌ దహనమయ్యాయి. అనంతపురం జిల్లా హిందూపురంలోని నానెప్ప నగర్‌లోని ఆయన ఇంట్లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రాణనష్టం ఏదీ సంభవించలేదని హిందూపురం టూటౌన్‌ సీఐ మధుభూషణ్‌ తెలిపారు. పేలుడు శబ్దంతో మొదటి ఫ్లోర్‌లో ఉన్న నరేష్‌ భార్య రమ్య, ఆమె సోదరి రమ, తల్లి మంజుల, పనిమనిషి సుశీల భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పింది. కాగా, ప్రమాదం వివరాలను నరేష్‌ ఫోన్‌ ద్వారా తెలుసుకున్నారు.

ఈ ప్రమాదం నుంచి నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఇంట్లోని 5 కిలోల గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో నరేష్ భార్య, అత్త మేడపైన గదిలో ఉన్నారు.

Gas Cylinder Exploded In Actor Naresh House

రీసెంట్ గా నరేష్, ఆమని ముఖ్యపాత్రలో ధృతి మీడియా పతాకంపై మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘పరంపర' చిత్రం విడుదలైంది. ఒక కుటుంబం యొక్క కలలాంటి కథ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో స్వచ్చమైన మానవీయ బంధాలను అత్యద్భుతంగా తెరపై చూపించిన మధు మహంకాళికి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో సత్కారం లభించింది. ‘పరంపర' చిత్రానికి ప్లాటినమ్ అవార్డ్ బహూకరించబడింది. ఈ అవార్డు లభించడం పట్ల చిత్ర దర్శక నిర్మాత మహంకాళి మధు సంతోషం వ్యక్తం చేసారు. అక్టోబర్లో ‘పరంపర' చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. సీనియర్ నరేష్, ఆమని ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X