»   » పెళ్లైన నిర్మాతతో సహజీవనం, ఇరుక్కున్న లక్స్ పాప

పెళ్లైన నిర్మాతతో సహజీవనం, ఇరుక్కున్న లక్స్ పాప

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నరసింహ నాయుడు చిత్రంతో లక్స్ పాపగా ఎంట్రీ ఇచ్చిన ఆశా శైనీ(ఇప్పడు మయూరి) ఇన్నేళ్లయినా పరిశ్రమలో నిలదొక్కులేక పోయింది. కారణం ఏదైనా...కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేక పోయింది. కెరీర్ లో పెద్గగా ఎదగలేకపోయిన ఆమె పర్శనల్ లైఫ్ లో కూడా కోర్టు చేత అక్షింతలు తినే పరిస్ధితి తెచ్చుకుంది. తను సహజీవనం చేసిన నిర్మాత శారీరకంగా వేధించాడంటూ కోర్టుకి ఎక్కి మరోసారి వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళితే ఆశాషైనీ ఆ మధ్యన ఆంఖే,దీవార్ వంటి బాలీవుడ్ చిత్రాల నిర్మాత గౌరాంగ్ దోషితో సహజీవనం చేసింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ పిభ్రవరి 15,2007లో తనని శారీరకంగా వేధించాడంటూ కోర్టుకి ఎక్కింది. ఆరున్నర కోట్ల నష్టపరిహారం కోరింది. అయితే అతనికి అప్పటికే వివాహం అయ్యింది. ఈ విషయం కోర్టు గుర్తు చేస్తూ..వివాహం అయిన వ్యక్తితో సహజీవనం చేసిన కారణం మీద ఆశాషైనీ కేసు చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో ఆమె ఆశించిన నష్ట పరిహారం అందలేదు. ఇంతకాలం ఆమె లాయిర్స్ కు పెట్టిన ఖర్చు కూడా వృదా అయ్యింది. నిర్మాత గౌరంగ్ దోషి...నిర్ధోషిగా బయిటపడ్డాడు.

ఇక ఆ మధ్య ముఖ్యంగా ఒక ఇంటివారు కావాలనుకునే యువతీ యువకుల మధ్య డేటింగ్ ఎంతో అవగాహన పెంచుతుందని చెపుతోంది. భార్యా భర్తలు కావాలనుకునే వారు తప్పనిసరిగా ముందుగానే డేటింగ్‌ లో పాల్గొనడం మంచిదని, అందులో తప్పులేదని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆశాషైనీ అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ.....నేనూ ఈ పరిశ్రమలో ఉన్నాను అంటూ అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటోంది.

అలాగే సినిమాల్లో బికినీ ధరించి నటించడాన్ని కూడా తాను విభేదించనని అంటోంది. గ్లామర్ పాత్రలకు తాను అన్ని వేళలా సిద్ధం అంటోంది. తను నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం మేరకు గ్లామర్ పాత్రలే అంటోంది. కథను బట్టి ఎలాంటి పాత్రలో నటించడానికైనా, బికినీ, టూపీస్ దుస్తులు వేయడానికైనా సిద్ధమేనని చెపుతోంది. ఇక ప్రస్తుతం ఆశాషైనీ తన పేరుని మయూరి గా మార్చుకుని అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది. అడపాదడపా ప్యాషన్ షోలు అవీ ఇవీ అంటూ కాలం గడుపుకొస్తోంది.

English summary
Producer Gaurang Doshi was acquitted in a case filed by starlet Flora Saini against him.On February 15, 2007, Saini, his then girlfriend, had lodged a complaint of physical assault.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu