»   » మహేష్ బాబు తనయుడిని విష్ చేయండి (ఫోటోలు)

మహేష్ బాబు తనయుడిని విష్ చేయండి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ పుట్టినరోజు నేడు. మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ దంపతులకు ఆగస్టు 31, 2006న గౌతం కృష్ణ జన్మించాడు. ప్రస్తుతం మమేష్ బాబు నటిస్తున్న '1(నేనొక్కడినే)' చిత్రం ద్వారా త్వరలో గౌతం కృష్ణ తెరంగ్రేటం చేయనున్న నేపథ్యంలో గౌతం పుట్టిన రోజు వేడుకలను మహేష్ బాబు అభిమానులు ప్రత్యేకంగా జరిపారు.

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు సినిమారంగంలోకి ప్రవేశిస్తే....మహేష్ బాబు నట వారసుడిగా గౌతం కృష్ణ తెరంగ్రేటం చేస్తున్నారు. మహేష్ బాబు తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినట్లే, గౌతం కూడా తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా వెండి తెరకు పరిచయం అవుతుండటం గమనార్హం.

ఇప్పటి నుండే గౌతం సినిమా కెరీర్‌కు బాటలు వేయడం ద్వారా భవిష్యత్‌లో మంచి నటుడిగా ఎదుగుతాడు అనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది....

మహేష్ బాబు ఫ్యామిలీ

మహేష్ బాబు ఫ్యామిలీ

మహేష్ బాబుది ముచ్చటైన ఫ్యామిలీ. తన సహచన నటి నమ్రతను మహేష్ బాబు ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి గౌతం, సితార పిల్లలు జన్మించారు.

గౌతం తెరంగ్రేటం

గౌతం తెరంగ్రేటం

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెర తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గౌతం కృష్ణ‌పై లండన్లో పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు.

బుల్లి మహేష్ బాబు పాత్రలో గౌతం

బుల్లి మహేష్ బాబు పాత్రలో గౌతం

ఈ చిత్రంలో గౌతం కృష్ణ...సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రను పోషించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సీన్లు ఆదివారం చిత్రీకరిచారు. మహేష్ బాబు తనయుడు తెరంగ్రేటం చేసే సినిమా కావడంతో ‘1' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ బాబు నటవారసత్వం

మహేష్ బాబు నటవారసత్వం

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా మహేష్ బాబు చిన్న తనంలోనే బాల నటుడిగా వెండి తెర తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో గౌతం మహేష్ బాబు నట వారసుడిగా వెండితెరంగ్రేటం చేయబోతుండటం గమనార్హం. మహేష్ బాబు తనయుడు గౌతం మహేష్ బాబు పోలికలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

మహేష్ కూతురు సితార

మహేష్ కూతురు సితార

మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ దంపతులకు జులై 20, 2012న సితార జన్మించింది. సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు మహేష్ కుటుంబ సభ్యులు.

English summary
Mahesh Babu is one person who is very much attachecd to his children. His son Gautam Krishna is celebrating his birthday on August 31st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu