వాళ్లు మూర్ఖులు, కుక్కలు.... అంటూ మండిపడ్డ నటి గౌతమి!
కమల్ హాసన్ తో కలిసి ఉండటం లేదని గౌతమి అన్నారు. చాలా కాలం క్రితమే అతడి నుండి దూరంగా వచ్చానన్నారు.
ప్రముఖ సౌతిండియా నటి గౌతమి ట్విట్టర్లో సంచలన కామెంట్స్ చేశారు. కమల్ హాసన్‌తో తన రిలేషన్ షిప్ విషయంలో తప్పుడు వార్తలు రావడంతో ఆమె మండి పడ్డారు. మూర్ఖులు అలాగే మాట్లాడతారు, కుక్కులు అలాగే మొరుగుతాయి అంటూ ఘాటుగా స్పందించారు.
భర్తతో విడిపోయిన తర్వాత కమల్ హాసన్‌తో ప్రేమలో పడిన గౌతమి... దాదాపు 13 సంవత్సరాలపాటు అతడితో కలిసి సహజీవనం చేసింది. సుధీర్ఘంగా సాగిన వీరి రిలేషన్ గతడేది బ్రేక్ అయింది. ఇద్దరి మధ్య ఏవో విబేధాలు రావడంతో విడిపోయారు.

మళ్లీ ఇద్దరూ కలిసినట్లు వార్తలు
తాజాగా తమిళ మీడియాలో కమల్ హాసన్, గౌతమి గురించి మళ్లీ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇద్దరూ మళ్లీ కలిసి జీవితాన్ని కొనసాగించలేక పోతున్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి.

ఓ టీవీ ఛానల్ ప్రత్యేక కథనం
ఇవి సోషల్ మీడియాలో రూమర్స్ అయితే గౌతమి పెద్దగా పట్టించుకోక పోవచ్చుకానీ..... ఓ ప్రముఖ టీవీ ఛానల్ వారు ఈ ఇద్దరి గురించి ఓ ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు.

అతడితో కలిసి ఉండటం లేదు
కమల్ హాసన్‌తో తాను మళ్లీ కలిసి జీవించడం లేదని, చాలా కాలం క్రితమే అతడి నుండి పక్కకు వచ్చేశానని గౌతమి వెల్లడించారు. ట్విట్టర్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సంచలన కామెంట్స్
‘మూర్ఱులు అలానే మాట్లాడతారు, కుక్కలు అలాగే మొరుగుతాయి... అంటూ తన మీద ప్రచారంలోకి వచ్చిన వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











