»   »  వావ్..! ఈ దసరాకేనా...? విజయ దశమి రోజే రానున్న "గౌతమీ పుత్ర శాతకర్ణి"

వావ్..! ఈ దసరాకేనా...? విజయ దశమి రోజే రానున్న "గౌతమీ పుత్ర శాతకర్ణి"

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చ‌క్రవ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతున్న చిత్రం కూడా కావ‌డంతో సినిమా ప్రారంభం నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ అంచ‌నాల‌కు త‌గ్గట్టు ద‌ర్శకుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక‌మైన చిత్రానికి సంబంధించి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ‌, వశిష్టిదేవిగా శ్రియాశ‌ర‌న్ ప్రీలుక్స్‌‌కు ఇటు నందమూరి అభిమానులు, అటు తెలుగు ప్రేక్షకుల‌కు నుంచి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి బాల‌య్య ముహుర్తాన్ని నిర్ణయించారు. అక్టోబ‌ర్ 9న శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ రాయ‌ల్ లుక్ విడుద‌ల కానుండ‌గా, స‌క‌ల విజ‌యాల‌ను క‌లుగు జేసే విజ‌య‌ద‌శ‌మి రోజు అంటే అక్టోబ‌ర్ 11 ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

Gautamiputra Satakarni

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ''నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న గౌత‌మిపుత్ర శాత‌కర్ణి సినిమా సినిమాలో నాలగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవల మ‌ధ్య ప్రదేశ్‌లో జ‌రిగిన నాలుగో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో రాజసూయ యాగాన్ని నిర్వహ‌ణ స‌న్నివేశంతో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను, ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ఐదో షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా టాకీకి సంబంధించి మేజర్ పార్ట్ అంతా పూర్తయ్యింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫ‌స్ట్‌ లుక్‌ను అక్టోబ‌ర్ 9న, టీజ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నాం. అలాగే సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నాం'' అని అన్నారు.

బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రియ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

English summary
Tollywood actor Nandamuri Balakrishna's much awaited flick Gautamiputra Satakarni which is his 100th flick is going on its shoot at a very brisk pace. Latest update from the movie unit is Gautamiputra Satakarni is set for release on January 12, 2017
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu