»   » కేవలం 130 నిమిషాల్లోనే: అయినా సరే గౌతమీపుత్ర శాతకర్ణి పక్కా హిట్ .., ఇవే కారణాలు

కేవలం 130 నిమిషాల్లోనే: అయినా సరే గౌతమీపుత్ర శాతకర్ణి పక్కా హిట్ .., ఇవే కారణాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతమీపుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి శాతకర్ణి తరువాత రాజయ్యాడు. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించాడు. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యాడు. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడింది... కానీ శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండేది.

శాలివాహనుడు శకులను, యవనులను, పల్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. ఈ చక్రవర్తి జీవితగాథ స్ఫూర్తిగా నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పుడు రాబోయే టాలీవుడ్ హయ్యెస్ట్ ఎక్స్పెక్టేడ్ మూవీల్లో గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా ఒకటి... అయితే ఈ సినిమా పై వచ్చే వార్తలు కొన్ని కాస్త షాకింగ్ గానే ఉన్నాయి, సినిమా నిడివీ, ఇందులో వచ్చే వార్ సీన్స్ పై వినిపిస్తున్న వార్తల పై ఒక లుక్.


అంచనాలు భారీగా ఉన్నాయి:

అంచనాలు భారీగా ఉన్నాయి:

డైరెక్టర్ క్రిష్ - బాలకృష్ణ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి ‘..బాలయ్య 100 వ సినిమా కావడం తో ఈ మూవీ ఫై అందరిలో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగట్టే క్రిష్ ఈ మూవీ ని కంప్లీట్ చేస్తున్నాడు. ఇక చారిత్మాక చిత్రంగా రాబోతున్న ఈ మూవీ రన్ టైం ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా , వారందరికీ షాక్ ఇచ్చాడు క్రిష్. కేవలం 130 నిమిషాల్లో మూవీ ని కట్ చేసాడట.


నీటిపై యుద్దం:

నీటిపై యుద్దం:

గౌతమీ పుత్ర శాతకర్ణి..సినిమా నిడివి 2 గం. 13 నుంచి 2గం.15 నిమషాలు వుండొచ్చని తెలుస్తోంది. అయితే ఇంత తక్కువ నిడివిలోనే ప్రథమార్థంలో రెండు వార్ సీన్లు, ద్వితీయార్థంలో రెండు వార్ సీన్లు వుంటాయట. వీటిలో ఒకటి నీటిపై యుద్దం. ఒక రాజు చరిత్రను మొత్తం జస్ట్ రెండు గంటల్లో, అది కూడా నాలుగు అద్భుతమైన వార్ సీన్ల నడుమ చెప్పడం అంటే, దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ లో ఎంత కేర్ తీసుకున్నారో?


బహుశా ఆ ఏంగిల్ లోనే:

బహుశా ఆ ఏంగిల్ లోనే:

వాస్తవానికి గౌతమీ పుత్ర శాతకర్ణి యుద్ధ పిపాసి అని, ఆయన ఎక్కువ కాలం యుద్దాలే చేసాడని అంటారు. బహుశా ఆ ఏంగిల్ లోనే ఈ సినిమా వుంటుందేమో ? ఇక సిన్మా క్లయిమాక్స్ విషయంలో అభిమానుల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారట. గౌతమీ పుత్ర శాతకర్ణి మరణం చూపించకుండా, అలా అలా ముగింపు వరకు తీసుకువచ్చి వదిలేస్తారట.


ఎంతమాత్రం నిజం లేదు:

ఎంతమాత్రం నిజం లేదు:

అయితే గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని యూనిట్ ముఖ్యుడు ఒకరు స్పష్టం చేశారు. శాతకర్ణి విమర్శకులు అనుకునే చిన్న సినిమా కాదని మరో రకంగా మాత్రం చిన్న సినిమా కావొచ్చని అయన చెప్పారు.చారిత్రక సినిమా కావడంతో నిడివి మరీ పెరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.


యుద్ధ సన్నివేశాలు నిడివి :

యుద్ధ సన్నివేశాలు నిడివి :

సినిమా నిడివి రెండున్నర గంటలకి మించకుండా స్క్రిప్ట్ దశలోనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.యుద్ధ సన్నివేశాలు నిడివి కాస్త ఎక్కువైనా సమయం,సందర్భం ,భావోద్వేగం కలగలిసి అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుందని సినిమా యూనిట్ చెప్తోంది.


కేవలం 130 నిమిషాల్లో:

కేవలం 130 నిమిషాల్లో:

సంక్రాంతికి రావాల్సిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కోసం సర్వం సిద్దం చేస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. పొంగల్ హీరోగా బాలయ్య కి తిరుగులేని రికార్డ్ గట్టిగా ఉంది. శాతకర్ణి సినిమా ని కేవలం 130 నిమిషాల్లో కట్ చేసాడు డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా కి రన్ టైం చాలా పెద్ద పాజిటివ్ గా చెబుతున్నారు. సాధారణంగా బాలయ్య సినిమా అంటే సెంటిమెంట్ సీన్ లు క్లైమాక్స్ లూ అన్నీ భారీగా సాగి ఉంటాయి.


అంచనాలు పెరుగుతున్నాయి :

అంచనాలు పెరుగుతున్నాయి :

దాంతో రన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ సినిమా మాత్రం తక్కువ నిడివి ఉండడం తో అంచనాలు పెరుగుతున్నాయి అంటున్నారు. కేవలం 130 నిమిషాల వ్యవధిలోనే 3-4 భీకరమైన యుద్ధాలను చూపించేయడం.. పెద్ద ప్లస్ పాయింట్ కానుందట. అయితే.. చారిత్రక చిత్రాన్ని ఇంత క్రిస్ప్ గా చూపించాల్సి రావడానికి కారణం మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ అనాల్సిందే.


అసలైన అడ్వాంటేజ్:

అసలైన అడ్వాంటేజ్:

3-4 గంటల సినిమా తీయడం కంటే.. ఆ మొత్తం ఎపిసోడ్స్ కు గ్రాఫిక్స్ జోడించేసరికి తలకు మించిన భారం అయిపోతుంది. నిజానికి గ్రాఫిక్స్ తో బేస్ అయిన మూవీతో అదే అసలైన అడ్వాంటేజ్.. విజువల్ ఎఫెక్ట్స్ కావడంతో.. మొత్తం స్టోరీ బోర్డ్ అంతా రెడీగా ఉటుంది. ప్రతీ షాట్ టైమింగ్ సిద్ధంగా ఉంటుంది.


హిట్ అని ఫిక్స్ అయ్యారు:

హిట్ అని ఫిక్స్ అయ్యారు:

మూవీ లెంగ్త్ ముందే తెలిస్తే. అందుకు తగినట్లుగానే షూట్ చేసుకునే సౌలభ్యాన్ని గ్రాఫిక్స్ కల్పిస్తాయి. సో రన్ టైం తక్కువ ఉంటె సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉన్న నందమూరి అభిమానులు ఈ సినిమా హిట్ అని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు .


English summary
Krish locks 'Gautamiputra Satakarni' runtime. Director Krish who is handling the direction of Nandamuri Balakrishna's 100th film, This prestigious film's length is fixed at two hours and twelve minutes, as per the latest update.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu