»   » బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మేకింగ్ వీడియోస్

బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మేకింగ్ వీడియోస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల క్యార‌క్ర‌మం ఇటీవల తిరుప‌తిలో జ‌రిగిన సంగతి తెలిసిందే.

ఆడియోకు మంచి స్పందన వస్తోంది. తాజాగా సినిమాలోని పాటలకు సంబంధించిన మేకింగ్ వీడియోలు రిలీజ్ చేసారు. మేకింగ్ వీడియోలు చూస్తే సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంత కష్టపడ్డారు అర్థమవుతోంది. ఇదొక ఎపిక్ మూవీ. విజువ‌ల్స్ పరంగా, కంటెంట్ పరంగా, అన్నింటి ప‌రంగా ఇదొక గొప్ప చిత్రం అనే అభిప్రాయం తెలుగు అభిమానుల్లో నాటుకు పోయింది.

rn

మృగ నయనా సాంగ్ మేకింగ్ వీడియో

శాతవాహనులు అనే పేరులో శాతము అంటే సింహం కాబట్టి సింహాన్ని వాహనంగా చేసుకున్నవారే శాతవాహనులు అంటే తెలుగువారు. అప్పట్లో 33 గణ రాజ్యాలను శాతకర్ణి గెలిచి ఒకే రాజ్యంగా చేసిన‌ప్పుడు ఆయ‌న జెండాల‌ను ప్ర‌తి ఇంటిపై నాటారు. మ‌న తెలుగువారికి న‌ర‌సింహ స్వామి దైవం. అందుకేనేమో బాల‌కృష్ణ‌గారు సింహా, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు వంటి సినిమాలు చేశారు. అందులో ఆయ‌న న‌రసింహ‌స్వామి భ‌క్తుడిగా క‌న‌ప‌డ్డారు. ఈ సినిమా స్టార్ట్ చేసేట‌ప్పుడు శాత‌క‌ర్ణి గురించి ఒక శాతం తెలిస్తే, ఇప్పుడు 70-80 శాతం మందికి తెలుసు. బాల‌కృష్ణ‌గారు ఒప్పుకోవడం వ‌ల్ల‌నే ఇది సాధ్యం అయిందని దర్శకుడు క్రిష్ ఇటీవల ఆడియో వేడుకలో చెప్పుకొచ్చారు.

rn

ఘణ ఘణ సాంగ్ మేకింగ్ వీడియో

ఈ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఒక రూపం నా కంటి ముందు ఆవిష్కృత‌మైంది. గౌత‌మిబాల వేసిన శాస‌నాల ఆధారంగా కొంత విష‌యం సంగ్ర‌హించాను. లండ‌న్‌లో మ‌న‌కు తెలియ‌ని మ‌న జాతి గొప్ప‌త‌నం ఎక్క‌డో ఉంది. సివిల్స్ చ‌దివే ఓ పుస్త‌కంలో ముప్పై ఐదు పేజీలు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి గురించి విష‌యం దొరికడంతో సినిమాను అక్క‌డ నుండి స్టార్ట్ చేశాం. బి.ఎన్‌.శాస్త్రి, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారు శాత‌క‌ర్ణి గురించి చెప్పిన విష‌యాల‌ను తెలుసుకున్నాను. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర‌లోని కొంత మంది మిత్రుల‌కు శాత‌క‌ర్ణి సినిమా చేస్తున్నాన‌ని చెప్ప‌గానే నువ్వు మ‌హారాష్ట్ర వీరుడు క‌థ చేస్తున్నావా అన్నారు. అదేంటి శాత‌క‌ర్ణి తెలుగువాడు అన్నాను. అంటే వీర శివాజీ త‌ల్లి జిజియా బాయి శివాజీకి నువ్వు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అంత గొప్ప‌వాడివి కావాల‌ని అనే చెప్పేద‌ని వారు చెప్పారు. అలాగే క‌న్న‌డ‌లో నూట్ర‌వ‌ర్ క‌న్న‌డ్ అని పిలుచుకుంటార‌ని తెలిసింది. అలాగే మెగ‌స్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో శాత‌క‌ర్ణి గురించి తెలిసింది అని దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చారు.

rn

బుర్రకథ సాంగ్ మేకింగ్ వీడియో

పాశ్చాత్యుల ద‌గ్గ‌రున్న చరిత్ర మ‌న ద‌గ్గ‌ర లేదు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఏ గ్రీకులోనో, రోమ్‌లోనో పుట్టి ఉంటే ఆయ‌న‌పై వంద పుస్త‌కాలు వ‌చ్చుండేవి. ప‌ది సినిమాలు వ‌చ్చుండేవి, క‌నీసం మూడు ఆస్కార్‌లైనా వ‌చ్చుండేవి. కానీ ఖ‌ర్మ మ‌నమేం చేయ‌లేదు. ఆయ‌న గురించి చ‌దువుతుంటే నా ర‌క్తం మ‌రిగింది. మ‌రి ఇలాంటి చ‌క్ర‌వ‌ర్తి ఎలా ఉండాలి. ఆ శాత‌క‌ర్ణి చూపు తీక్ష‌ణంగా ఉండాలి. ఆయ‌న న‌డుస్తుంటే కాగ‌డా ర‌గులుతున్న‌ట్లు ఉండాలి. క‌థే క‌థానాయకుడిని ఎన్నుకుంటుంది. అడుగో బ‌స‌వ‌తార‌క‌మ్మ‌పుత్ర బాల‌కృష్ణ‌నే శాత‌క‌ర్ణిగా స‌రిపోతాడని శాత‌క‌ర్ణి నాకు చెప్పిన‌ట్టు అనిపించింది. ఇది నేనేదో ఆవేశంతో చెబుతున్న మాట‌లు కావు, ఆలోచించి చెబుతున్న మాట‌లు. కేవ‌లం క‌థ‌ను ప‌దినిమిషాల్లోనే విని, ప‌ద్నాలుగు గంట‌ల్లోనే ఈ సినిమా చేస్తున్న‌ట్లు చెప్పిన వ్య‌క్తి బాల‌కృష్ణ‌గారి వ‌ల్లే ఈ రోజు ఇక్క‌డ నిల‌బ‌డి మాట్లాడుతున్నాను... అని దర్శకుడు క్రిష్ తెలిపారు

rn

సాహో సార్వభౌమ సాంగ్ మేకింగ్ వీడియో

ప్ర‌ణాళిక బ‌ద్ధంగా వెళ్లాం. ఎప్పుడో శాత‌క‌ర్ణి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేసుకుని ఏల‌డం ఏంటి, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని కావడమేంటి? అంతా దైవ సంక‌ల్పం. తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాను. ఇది టికెట్స్ తెగ‌డానికి కాకుండా నాలోని కోపంతో చెబుతున్న మాట‌లు. ఇలాంటి సినిమాను ఒప్పుకున్న బాల‌య్య‌బాబుగారికి ధ‌న్య‌వాదాలు. నాతో పాటు ఆయ‌న కూడా కెప్టెన్‌గా ముందున్నారు. ప‌ద్నాలుగు నుండి ప‌ద‌హారు గంట‌ల‌పాటు క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంక్రాంతికి వ‌స్తుంది అని క్రిష్ తెలిపారు.

rn

ఎకిమీడా సాంగ్ మేకింగ్ వీడియో

కాశీలో గౌత‌మిబాల వేసిన శాస‌నాలు ఆధారంగా ఈ క‌థ‌ను ప్రారంభించారు. క్రిష్‌గారు తెలుగువారు గ‌ర్వ‌ప‌డే సినిమాలు చేశారు. నా 100వ సినిమాగా ఏం చేయాల‌ని ఆలోచిస్తూ ఎన్నో క‌థ‌లు విన్నాను. ఆ సందర్భంలో క్రిష్ వ‌చ్చి ఈ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి గురించి చెప్పారు. న‌చ్చ‌డంతో సినిమా మొద‌లైంది. ఇలాంటి సినిమా చేయ‌డానికి మంచి అభిరుచులున్న నిర్మాత‌లు కూడా కావాలి. అలాంటి నిర్మాత‌లు ఈ సినిమాకు దొరికారు. చిరంత‌న్‌భ‌ట్‌గారు సినిమాకు అద్భుత‌మైన సంగీతానందించారు. సాయిమాధ‌వ్‌గారు ఎంతో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు. జ్ఞాన‌శేఖ‌ర్‌గారు ప్ర‌తి సీన్‌ను ఎంతో గొప్ప‌గా చూపించారు. ఈ సినిమా చేయ‌డం గొప్ప సంక‌ల్ప బ‌లంగా భావిస్తున్నాం. హేమామాలినిగారు లేకుండా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఉండేది కాదు. అలాగే శివ‌రాజ్‌కుమార్‌గారు ఈ సినిమాలో మంచి పాత్ర‌లో, ఓ మంచి సాంగ్‌లో న‌టించారు. వ్య‌వ‌సాయం చేసేలా రైతులా నేను కూడా వంద ర‌క‌ర‌కాలైన పాత్ర‌లు చేశాను. అలాగే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కానీ స‌మ‌యం లేదు మిత్ర‌మా..సినిమా సంక్రాంతికే. ఈ సంద‌ర్భంగా నాకు అండ‌గా నిల‌బడ్డ ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు థాంక్స్‌ అని బాలయ్య తెలిపారు.

English summary
Gautamiputra Satakarni movie songs making videos. Here comes the first glimpse of Nandamuri Balakrishna as the Greatest warrior Emperor Gautamiputra Satakarni from the Magnam Opus Period movie by Anjana Putra Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu