»   » బాలకృష్ణ సంక్రాంతి :అభిమానుల స్పందన తో హోరెత్తుతున్న థియేటర్లు

బాలకృష్ణ సంక్రాంతి :అభిమానుల స్పందన తో హోరెత్తుతున్న థియేటర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బసవతారక రామపుత్ర బాలయ్య 99 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇక తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన వందో చిత్రాన్ని ఇలాంటి చారిత్రాత్మక కథతో చేయాలనే బాలయ్య సంకల్పం చాలా గొప్పగా ఉంది. సంక్రాంతి పండుగని టార్గెట్ చేసుకొని సినిమా రిలీజ్ చేయాలని భావించిన టీం కేవలం 78 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ రోజు థియేటర్స్ లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ పూర్తి కాగా.. బాలయ్య అభిమానులు ఆనందడోలికలో మునిగి తేలుతున్నారు.

కొద్ది సేపటి క్రితం నందమూరి బాలకృష్ణ కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్‌లో అభిమానులతో కలిసి బెనిఫిట్ షో చూశాడు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి బాలయ్య ఆనందభరితుడయ్యాడు. తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఇక ప్రేక్షకుల విషయానికి వస్తే ఓ పరిపూర్ణ నటుడిగా బాలయ్య ప్రదర్శించిన నటనకు జేజేలు పలుకుతున్నారు.గుర్రపు స్వారీలు, కత్తి ఫైట్స్ , భారీ సంభాషణలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో బాలయ్య నటనా పటిమ, ఆయన ప్రదర్శించిన తీరు అపూర్వం.. అభినందనీయం అని అంటున్నారు. ఇక వశిష్టి దేవి పాత్రలో శ్రేయ ఒదిగిపోయి అందరిచే ప్రశంసలు అందుకుంటుంది. సీనియర్ నటి హేమమాలిని బాలయ్య తల్లి పాత్రలో అత్యద్భుతంగా నటించి అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది.


నందమూరి హీరో బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రాష్ట్రాలలోని ముఖ్య సెంటర్లలో గురువారం ఉదయం బెన్‌ఫిట్ షో వేశారు. బాలకృష్ణ వందో చిత్రం వంద రోజులు కాదు 365 రోజులు ఆడుతుందంటూ అభిమానులు ఉత్సాహంగా చెప్పారు. థియేటర్లు కేరింతలు, విజిల్స్‌తో మార్మోగుతున్నాయి. మంత్రముగ్ధులమయ్యామని ఒకరు, శాతకర్ణి చరిత్ర తిరగరాస్తుందని ఇంకొకరు.


సింహం జూలు విదిల్చిందని మరొకరు. అంతటా అదే ఉత్సాహం.. బాలయ్య సినిమా చూసిన ఆనందం అంతా ఇంతా కాదు. శాతవాహన రాజు, శాతకర్ణి చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కూటక్‌పల్లి భ్రమరాంబిక థియేటర్‌లో శాతకర్ణి సందడి నెలకొంది. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ సహా యూనిట్ మొత్తం సినిమా చూసింది. శాతకర్ణి అభిమానులను అలరిస్తుందని బాలకృష్ణ అన్నారు. శాతకర్ణి గొప్ప తెలుగుజాతి యోధుడి కథ అని దర్శకుడుద క్రిష్ అన్నారు.

English summary
Gautamiputra Satakarni boasts an ensemble cast in the form of Balakrishna, Shriya Saran, Hema Malini and few others. Made on a limited budget in a short span of time, the film is predominantly shot in Morrocco and Georgia.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu