»   » ‘శాతకర్ణి’ పై బోయపాటి, బన్ని, సాయి ధరమ్ తేజ, నితిన్ ..ఇలా అందరూ

‘శాతకర్ణి’ పై బోయపాటి, బన్ని, సాయి ధరమ్ తేజ, నితిన్ ..ఇలా అందరూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి కానుకగా విడుదలైన ...బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఫ్యాన్స్ ఆనందంతో చేసే నినాదాలతో థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపధ్యంలో బాలయ్యతో రెండు సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ క్రింది విధంగా స్పందించారు.


''గౌతమిపుత్ర శాతకర్ణి'.. తెలుగుజాతి తెలుసుకోవాల్సిన చరిత్ర, చూడాల్సిన చిత్రం. బాలకృష్ణ, క్రిష్‌, సాయిమాధవ్‌ తదితర చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని దర్శకుడు బోయపాటి పోస్ట్‌ చేస్తూ.. 'సాహో శాతకర్ణి' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.


హీరో నితిన్ కూడా ఈ సినిమా విజయంపై స్పందించాడు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక విజయం సాధించిందని నితిన్ చెప్పాడు. నందమూరి బాలకృష్ణకు చిత్రం విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. క్రిష్‌, శ్రియ, రాజీవ్, చిత్ర యూనిట్ అందరికీ నితిన్ శుభాకాంక్షలు తెలిపాడు. తెలంగాణలో ఈ సినిమా నైజాం హక్కులు దక్కించుకున్నది నితిన్ కావడం విశేషం.


అద్బుతంగా ఉన్నాయి

అద్బుతంగా ఉన్నాయి

దర్శకుడు క్రిష్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం గర్వకారణమని దర్శకురాలు నందినిరెడ్డి అన్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని గురువారం చూసిన నందినిరెడ్డి తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి'లో బాలకృష్ణ నటన, మాటలు, చిత్రీకరణ, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయని అన్నారు. క్రిష్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. క్రిష్‌ విజన్‌ను నమ్మిన బాలకృష్ణను అభినందించారు.


వింటున్నట్లే తెలియలేదు

వింటున్నట్లే తెలియలేదు

ఈ చిత్రాన్ని చూసిన గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సినిమాని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘శ్రియతో కొడుకు గురించి ‘వదులుకుంటానా.. పోగొట్టుకుంటానా' అనే బాలయ్యను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అదొకటి ఉన్నట్లు.. వింటున్నట్లు తెలియలేదు.. అంతగా కథాగమనంలో కలిసిపోయింది చిరంతన్‌ భట్‌ గారి నేపథ్య సంగీతం' అని ట్వీట్‌ చేశారు.


ఛీర్స్ అంటూ..

ఛీర్స్ అంటూ..

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. తన తీర్పు నిజం కావడం చాలా థ్రిల్‌గా ఉందన్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి'కి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఆయన అభినందనలు తెలిపారు. దర్శకుడు క్రిష్‌కు, బాలయ్యకు 100 చీర్స్‌ అని ట్వీట్‌ చేశారు. అరువు తెచ్చుకున్న కథతో కాకుండా.. యదార్థ కథతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఆకాశానికి తీసుకెళ్లారని.. ఇందుకు దర్శకుడు క్రిష్‌, బాలయ్యకు తాను సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. బాలకృష్ణ 100వ చిత్రం 150 సార్లు గొప్ప చిత్రంగా నిలిచిందనే అర్థంతో వర్మ ట్వీట్‌ చేశారు.


అద్బుతకావ్యం అంటూ..

అద్బుతకావ్యం అంటూ..

టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి ఈ సినిమాను బాలయ్యతో కలిసి చూశాడు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి'పై ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. ‘శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని కొనియాడారు. బాలకృష్ణ నటనకు హ్యాట్సాప్‌ చెప్పకుండా ఉండలేమన్నారు. రచయిత సాయిమాధవ్‌ సంభాషణలు, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తెలుగు చిత్రాల్లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి' అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు.


స్పూర్తి అంటూ..

నందమూరి బాలకృష్ణ మాలో చాలా మందికి స్ఫూర్తి అని మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ అన్నారు. క్రిష్‌- బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘గౌతమిపుత్ర శాతకర్ణి'కి గొప్ప స్పందన వస్తోందని విన్నాను. దర్శకుడు క్రిష్‌కు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారు మాలో చాలా మందికి స్ఫూర్తి' ట్వీట్‌ చేశారు.


హీరో రామ్‌ ఇలా..

‘‘ఇది కదా సంక్రాంతి అంటే'.. ఈ సంక్రాంతికి రెండు పండుగలు.. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది' అని రామ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి', ‘ఖైదీ నంబర్‌ 150', చిరు, బాలయ్య అనే హ్యాష్‌ట్యాగ్‌లు జత చేశారు.


అందరికీ..

ఇంతేకాదు ‘గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదల సందర్భంగా అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌, మంచు మనోజ్‌ తదితరులు ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. వీరందరికీ దర్శకుడు క్రిష్‌ ధన్యవాదాలు చెప్పారు.


ఇలాంటివి ఇష్టం..

ఇలాంటివి ఇష్టం..

చాలా రోజులుగా బాలయ్యకు దూరంగా ఉంటూ వస్తున్న అక్కినేని నాగార్జున ‘గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా గురించి ట్వీట్‌ చేశాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాడు. ‘బాలయ్య, క్రిష్‌ అండ్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నాకు హిస్టారికల్‌ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా కూడా హిస్టరీ క్రియేట్‌ చేయాలని కోరుకుంటున్నాన'ని నాగ్‌ ట్వీట్‌ చేశాడు.


చంద్రబాబు చూస్తారు

చంద్రబాబు చూస్తారు

తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో తెరకెక్కించేందుకు కృషి చేసిన దర్శకుడు క్రిష్‌, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజయవాడలో ఈ చిత్రాన్ని వీక్షించనున్నట్లు తెలిపారు.


భాధ్యత పెంచింది

భాధ్యత పెంచింది

‘నాన్న గారు చేయాల్సిన పాత్ర.. నాకు దక్కడం అదృష్టం. అలాగే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నగరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఈ చిత్రం చేయడం యాదృచ్ఛికం. తెలుగు సినీ చరిత్రలో ఈ చిత్రం అజరామరంగా నిలుస్తుంది. ప్రేక్షకుల కోరుకున్నట్లుగా నటించడం ఆనందంగా ఉంది. ఇలాంటి చారిత్రక చిత్రంలో నటించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ విజయం నాపై మరింత బాధ్యత పెంచింది. ప్రారంభోత్సవం రోజునే విడుదల తేదీ ప్రకటించి అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగాం.' అని బాలకృష్ణ చెప్పారు.


అద్బుతం..

అద్బుతం..

‘చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు క్రిష్‌ వల్లే ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలకృష్ణ గారి నటన అద్భుతం' అంటూ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన శ్రియ చెప్పుకొచ్చింది. బాలయ్య భార్యగా శ్రియ చేసిన పాత్రకు మంచి స్సందన వస్తోంది.


బాలయ్య భుజస్కందాలపై

బాలయ్య భుజస్కందాలపై

‘ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ప్రతి తెలుగువాడు, భారతీయుడు చూడదగ్గ చిత్రమిది. బాలకృష్ణ గారి అండతోనే ఈ చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం. ఈ చిత్ర బాధ్యతలను బాలకృష్ణ తన భుజస్కందాలపై మోసి అద్భుత చిత్రంగా తెరకెక్కించేందుకు సహకరించారు' అంటూ స్పందించారు దర్శకుడు క్రిష్‌.


కితాబులు

కితాబులు

‘గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. సినీ ప్రముఖులతో పాటు బాలకృష్ణ అభిమానులు ఈ చిత్రం అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు.


English summary
Filmmaker SS Rajamouli and Boyapati and many others took to Twitter and appreciated Nandamuri Balakrishna's Gautamiputra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu