»   » వీడియో: కాంట్రవర్శిలపై బాలయ్య షాకిచ్చే కామెంట్స్, కొత్త చిత్రం డిటేల్స్

వీడియో: కాంట్రవర్శిలపై బాలయ్య షాకిచ్చే కామెంట్స్, కొత్త చిత్రం డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మల్యే బాలకృష్ణ రీసెంట్ గా చొక్కా విప్పి, సిగరెట్ తాగుతంటే వచ్చిన కాంట్రవర్శీపై చాలా కోపంగా ఉన్నారు. దాంతో ఆయన ఆఫ్ ది స్టేజ్ లా స్టేజీపై మైకులు లేవనుకుని మైకుల ఉండటం మర్చిపోయి మాట్లాడేసారు.

ఆయన తన సహచరులుతో త్రిష హీరోయిన్ గా చేసిన నాయికి చిత్రం ఆడియో పంక్షన్ ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆడియో పంక్షన్ అయ్యిపోయాక..ఆయన తన సాటి నటులైన త్రిష,మరికొందరుతో...స్టైపీపైన ...తన స్వేచ్చ గురించి మాట్లాడారు. ఆయనేం మాట్లాడారో ఇక్కడ చూడండి.పబ్లిక్ లో ఈ స్టేట్ మెంట్ ఇవ్వకపోయినా, ఆన స్టేజీ మీద మాట్లాడిన మాటలు, చుట్టూ ఉన్న మైక్ ల ద్వారా బయిటకు వినిపించి అందరినీ షాక్ అయ్యేలా చేసాయి. ఆయనేం అన్నారో మీరు వినే ఉంటారు. అదేమిటంటే... " సిగెరెట్ తాగితే తప్పు, అమ్మాయిలను ముద్దు పెట్టడం గురించి, అమ్మాయిలను ప్రెగ్నింగ్ చేయటం మాట్లాడితే తప్పు, స్వేచ్చ ఎక్కడ " అన్నారు.


ఇప్పుడీ చిన్న వీడియో ..సోషల్ మీడియాలో వైరల్ లా వెళ్తోంది. బాలయ్య మళ్లీ ఇలా ఆఫ్ స్టేజ్ మీద కూడా మాట్లాడకూడాదా అని మరోసారి అనాల్సి వస్తుందేమో అన్నట్లుగా ఈ వీడియో ప్రచారం అవుతోంది.


ఇక బాలకృష్ణ కొత్త చిత్రం విషయానికి వస్తే...


ఉగాది పర్వదినం సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ తన వందో చిత్రం వివరాలు వెల్లడించారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు అందిచబోతున్నాం.


భారీ సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న ఈ చారిత్రక కథా చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రం అఫీషియల్ గా ఏప్రియల్ 22న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా లాంచ్ కానుంది. ఫ్యాన్స్, సినీ, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో ఈ షూటింగ్ ప్రారంభించనున్నారు.


మే నెల మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అలాగే..జూన్ 10 న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ...టీజర్ ని లాంచ్ చేయనున్నారు.ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె.సాయిబాబు, రాజీవ్‌రెడ్డి దీన్ని నిర్మించనున్నారు.


200 సంవత్సరాల క్రిందటి కథ

200 సంవత్సరాల క్రిందటి కథ

‘గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రమిది. 200 సంవత్సరాల క్రిందట కథ ఇది.లొకేషన్స్

లొకేషన్స్

200 సంవత్సరాల క్రితంకు తగిన లొకేషన్లను క్రిష్‌ యూరప్‌ లో ఎంపిక చేసారు.


దేవినే..

దేవినే..

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించే అవకాశాలున్నాయి.కీలకమైన పాత్రలో..

కీలకమైన పాత్రలో..

కీలకమైన పాత్రలో బాలీవుడ్‌ నటి హేమామాలినీ కనిపించనున్నారని మరో టాక్‌. అప్పుడెప్పుడో ‘పాండవ వనవాసం' చిత్రంలో హేమా కనిపించారు. ఆ తరవాత తెలుగులో నటించనే లేదు.


ఆ పాత్రమిటంటే...

ఆ పాత్రమిటంటే...

గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో ఆమె కనిపిస్తారని టాక్‌. ఈ పాత్ర కోసం శోభన పేరు కూడా పరిశీలనలో ఉంది.


ద్విపాత్రాభినయం...

ద్విపాత్రాభినయం...

ఈ చిత్రంలో ఈ జనరేషన్ కు చెందిన వ్యక్తిగానూ, శాతవాహన సామ్రాజ్యాన్ని ఏలిన గౌతమి పుత్ర శాతకర్ణిగా ఆయన ద్విపాత్రాభినయం చేసి మెప్పించనున్నారు.


సోషల్ ఇష్యూలు

సోషల్ ఇష్యూలు

అలాగే ఈ చిత్రంలో కంచెలో లాగానే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని కాంటంపరరీ ఇష్యూలను సినిమాలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఆ కాలం, ఈ కాలం

ఆ కాలం, ఈ కాలం

ఈ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి నాటికి, ఇప్పటి కాలానికి మధ్య జరుగుతుంది. ఆ కాలానికి ఈ కాలానికి మధ్య వ్యత్యాసం చూపుతుంది. చివర్లో మళ్లీ ఆ నాటి రోజులు రాబోతున్నాయని హింట్ ఇస్తారు.బడ్జెట్

బడ్జెట్

దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున బాలకృష్ణ కెరీర్ లోనే నిలిచిపోయే చిత్రంగా రూపొందింస్తారు.విడుదల ఎప్పుడు

విడుదల ఎప్పుడు

సంక్రాంతి 2017 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
English summary
Balakrishna's Gautamiputra Satakarni will be launched in grand way at Annapurna Studios in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu