»   » చెడగొట్టే ఉద్దేశ్యం లేదని మహేష్ బాబు అంటుంటే...ఇదేంటి?

చెడగొట్టే ఉద్దేశ్యం లేదని మహేష్ బాబు అంటుంటే...ఇదేంటి?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన మహేష్ బాబు... అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారు. గతంలో మహేష్ బాబు తన తండ్రి నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాల పేర్లు కూడా ఇందులో వినిపించాయి.

  ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ వార్తలపై స్పందిస్తూ.... అవి ఆణిముత్యాల్లాంటి సినిమాలు, వాటిని రీమేక్ చేసి పేరు చెడగొట్టుకునే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేసారు. అయితే తాజాగా అల్లూరి సితారామరాజు సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.

  త్వరలో 'అల్లూరి సీతారామరాజు' సినిమాకు ప్రీక్వెల్ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అల్లూరి సీతారామరాజు చిన్నతనం, ఆయన పెరిగిన వాతావరణం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడానికి ప్రేరేపించిన పరిస్థితులను ఈ సినిమాలో ఫోకస్ చేయబోతున్నట్లు సమాచారం.

  ఈ ప్రీక్వెల్ లో మహేష్ బాబు తనయుడు గౌతం యంగ్ సీతారామరాజుగా కనిపించబోతున్నారని అంటున్నారు. స్లైడ్ షోలో ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు...

  40 ఏళ్ల తర్వాత.

  40 ఏళ్ల తర్వాత.

  అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలై దాదాపు 40 సంవత్సరాలైంది. ఇన్నేళ్ల తర్వాత ఈచిత్రానికి ప్రీక్వెల్ ప్రయత్నాలు జరుగుతుండటం చర్చనీయాంశం అయింది.

  ఆ రచయిత పేరు

  ఆ రచయిత పేరు

  నడిమింటి నరసింగరావు అనే రచయిత ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

  బాల్యం

  బాల్యం

  అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాట యోధుడిగా మారడానికి బాల్యంలో ఎటువంటి సంఘటనలు ప్రభావితం చేశాయనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  మహేష్ బాబు

  మహేష్ బాబు

  అల్లూరి సీతారామరాజు పాత్రతో మరో సినిమా చేద్దామని, ఇందులో నటించమని పలువురు దర్శకులు గతంలో మహేష్‌బాబుని సంప్రదించినా కూడా ఆయన ఒప్పుకోలేదు.

  ఇపుడు గౌతం పేరు

  ఇపుడు గౌతం పేరు

  ఆ సినిమాను తన కొడుకుతో చేయించేందుకు మహేష్‌బాబు ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.

  బాలనటుడిగా

  బాలనటుడిగా

  గతంలో గౌతం '1 నేనొక్కడినే' సినిమా ద్వారా బాలనటుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో అతడి పాత్ర పరిమితంగా ఉంది.

  పూర్తిస్థాయి బాలనటుడుగా

  పూర్తిస్థాయి బాలనటుడుగా

  అల్లూరి సీతారామరాజు మూవీ ప్రీక్వెల్ ద్వారా గౌతమ్‌ను పూర్తిస్థాయి బాలనటుడిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

  కృష్ణ, మహేష్ బాబు

  కృష్ణ, మహేష్ బాబు

  తాను తయారు చేసిన స్క్రిప్టును నడిమిటి నరసింహారావు కృష్ణతో పాటు, మహేష్ బాబుకు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది.

  గ్రీన్ సిగ్నల్ కోసం

  గ్రీన్ సిగ్నల్ కోసం

  మహేష్ బాబు, కృష్ణ లనుండి గ్రీన్ సిగ్నల్ కోసం నడిమిటి నరసింహారావు ఎదురు చూస్తున్నారని టాక్.

  అదే నిజమైతే..

  అదే నిజమైతే..

  ఇదే నిజమైతే... ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Film Nagar source said that, Mahesh Babu’s son Gautham playing the young Alluri Seetharamaraju in the prequel to the iconic ‘Alluri Seetharamaraju’ film starring Krishna. Senior writer Nadiminti Narasimha Rao has reportedly done enough research to prepare a subject dealing the situations that influenced young Alluri to take up the fight for Independence. He feels that Gautham will be apt to play the young Alluri.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more