»   » యాక్షన్,లవ్ స్టోరీ ( 'బసంతి' ప్రివ్యూ)

యాక్షన్,లవ్ స్టోరీ ( 'బసంతి' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్... సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వంలో వచ్చిన 'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో తెరమరుగయిపోయారు. కానీ సినిమాలకు మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు మళ్లీ 'బసంతి' అంటూ వస్తున్నాడు. 'బాణం' దర్శకుడు చైతన్య దంతులూరి డైరర్టర్ కావటంతో ఈ చిత్రంపై పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి.

యాక్షన్ లవ్ స్టోరీగా చెప్పబడుతున్న ఈ చిత్రం ఉగ్రవాదం సమస్యని నేపథ్యంగా ఎంచుకొని తెరకెక్కించారు. బసంతి కళాశాలలో చదివే విద్యార్థి అర్జున్ గా గౌతమ్‌ కనిపిస్తారు. సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. అర్జున్ ప్రేమ కథకీ,ఉగ్రవాదానికి లింక్ ఏమిటన్న విషయంపై కథ నడుస్తుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి అల్లరి చిల్లరిగా తిరిగే ఓ అబ్బాయికి బాధ్యతలు వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడవచ్చు. నక్సలిజం సమస్యని... తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా 'బాణం' రూపంలో తెరకెక్కించారు దర్శకుడు చైతన్య దంతులూరి. ఇప్పుడు ఆయన దర్శకనిర్మాణంలో వస్తోన్న మరో చిత్రం 'బసంతి'. ఇందులో తీవ్రవాదాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు.

Gautham' Basanthi movie preview

బ్రహ్మానందం మాట్లాడుతూ " గౌతమ్ కెరియర్ లో ఇది మంచి సినిమా అవుతుంది. నేను ఓ నటుడిగా ప్రేక్షకుడిగా గౌతమ్ నటనను చూసి సంతృప్తి పడ్డాను.చాలా నేచురల్ గా ఉంటుంది. పల్లకి లో పెళ్ళి కూతురు సినిమా చేసే నాటికి గౌతమ్ కు 18 సంవత్సరాలు. ఈ సినిమాలో తన నటనలో పరిపక్వత కనిపిస్తోంది. ఇది ఆర్ట్ సినిమానో ప్రయోగాత్మక చిత్రమో కాదు. లవ్, సెంటిమెంట్, యాక్షన్ ,కామెడీ ఇలా అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సినిమా సహజంగా సాగినా అందులో కమర్షియల్ అంశాలు చాలానే ఉన్నాయి అన్నారు.


హీరో గౌతమ్‌ మాట్లాడుతూ ''ఓ మంచి కథ బసంతి. దర్శకుడు కథ చెబుతున్నపుడు ఎంతో ఆసక్తి కలగడంతో పాటు, ఉద్వేగా నికి లోనయ్యాను. నేను పోషిస్తున్న అర్జున్‌ పాత్ర నటుడిగా నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నా''అన్నారు.

నటీనటులు: . గౌతమ్‌, అలీషాబేగ్‌, తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ తదితరులు
సంగీతం: మణిశర్మ,
పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి,
ఛాయాగ్రహణం: అనీల్‌ బండారి, పి.కె.వర్మ.
మాటలు: శ్రీకాంత్ విస్సా,
నృత్యాలు: రఘు,
ఆర్ట్: రఘు కులకర్ణి,
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్,
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల,
కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య
విడుదల తేదీ: 28,పిభ్రవరి 2014.


English summary
Brahmanandam's son Gautam,Alisha Baig starrer ‘Basanthi’ directed and produced by Chaitanya Dantuluri is getting ready for release on Feb., 27th. Tanikella Bharani,Shayaji Shinde,Ranadheer Gatla, Naveena Jackson are the other stars in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu