స్టైయిల్‌లో మహేష్‌ను మంచిన గౌతమ్ కృష్ణ.. అచ్చం తండ్రిలానే..
భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ విభిన్న రితీలో ప్రారంభించారు. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. తాజాగా మహేష్‌బాబు చిన్నప్పటి ఫొటోతోపాటు, ప్రిన్స్ కుమారుడు గౌతమ్ కృష్ణ ఫొటోను జత చేసి మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గౌతమ్ కృష్ణ చిన్నప్పటి ప్రిన్స్ మహేష్ మాదిరిగా స్టయిలీష్‌గా నిలిచొని ఉన్న చిత్రం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకొంటున్నది. ఇప్పటికే 1 నేనొక్కడినే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. త్వరలోనే టాలీవుడ్‌లో మెరుపులు మెరిపించడం ఖాయమనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

gautam krishna bharat ane nenu kiara advani mahesh babu koratala siva jr ntr prakash raj భరత్ బహిరంగ సభ భరత్ అనే నేను కైరా అద్వానీ మహేష్ బాబు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ ప్రకాశ్ రాజ్


Click it and Unblock the Notifications