»   » సమంత, గౌతమ్ మీనన్ కాంబినేషన్ నెక్స్ట్ చిత్రం రిలీజ్ డేట్...

సమంత, గౌతమ్ మీనన్ కాంబినేషన్ నెక్స్ట్ చిత్రం రిలీజ్ డేట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్యతో 'ఏమాయ చేసావె' చిత్రం రూపొందించి విజయం సాధించిన గౌతమ్ మీనన్ తన తదపరి చిత్రం 'ఎర్ర గులాబీలు' విడుదలకు రంగం సిద్దమైంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన 'ఎర్ర గులాబీలు' చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. సమీరారెడ్డి ప్రధాన పాత్రధారి అయిన ఈ చిత్రంలో కథకి కీలకమైన మరో పాత్రని సమంత చేసింది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ అని అభివర్ణిస్తున్నారు.

ఇక ఈ చిత్రం గురించి నిర్మాత అశోక్ మాట్లాడుతూ "'ఏ మాయ చేసావె' తర్వాత గౌతమ్ మీనన్ రూపొందించిన చిత్రం. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ మధ్యనే జరిగిన ఓ సంఘటనని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశారు. సెన్సార్ వాళ్లు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికే తెలుగు చిత్రసీమలో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొని ఉంది. ఆ అంచనాలను మించేట్లుగా ఉంటుంది ఈ చిత్రం'' అని చెప్పారు.

కార్తీక్, వీరా హీరోలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: రంగనాథ్ రావే, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఆంథోని, కళ: రాజీవన్, ఫైట్స్: శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.

English summary
The censor formalities of Samantha’s latest flick ‘Erra Gulabeelu’ have been completed. The film acquired ‘A’ certificate and is set for February 18th release. ‘Erra Gulabeelu’ stars Sameera Reddy, Karthik, Veera and Samantha in lead roles. The story, screenplay and direction were handled by Gautham Vasudev Menon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more