For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భాదేస్తోంది, వాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్, కించపరుచుకోవం మానేయండి: డైరక్టర్ క్రిష్ (ఇంటర్వూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ ల్యాండ్‌ మార్క్‌ సినిమా సంక్రాంతి బరిలో కలెక్షన్లతో దూసుకుపోతున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఇప్పటికే తొలిరోజు రూ. 18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇటు బాలకృష్ణ కెరీర్‌లోనూ, అటు దర్శకుడు క్రిష్‌ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా రికార్డు సాధించింది.

  ప్రస్తుతానికి బాక్సాఫీస్‌ వద్ద సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్టు సినీ పండితులు చెప్తున్నారు. 'శాతకర్ణి' సినిమా 'ఏ' సెంటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, బీ, సీ సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నదని అంటున్నారు. అయితే, తెలుగు చక్రవర్తి శాతకర్ణి చారిత్రక కథతో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అటు బాలకృష్ణకు, ఇటు దర్శకుడు క్రిష్‌కు గర్వించే సినిమా అని వారు అభిప్రాయపడుతున్నారు.

  ఫెస్టివల్‌ సీజన్‌లో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌ భారీ వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ. 48 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. తొలిరోజు దేశీయంగా రూ. 18 కోట్లు, ఓవర్సీస్‌ మార్కెట్‌లో రూ. 8 కోట్లు, రెండోరోజు దేశీయంగా రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌ రూ. 5 కోట్లు, మూడు రోజు దేశీయంగా రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్టు ట్రెడ్‌ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా చిత్రానికొస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు క్రిష్‌. ఆయన చెప్పిన విషయాలివీ...

   వక్రీకరించామని ఎలా అంటాం..

  వక్రీకరించామని ఎలా అంటాం..

  శాతకర్ణి జీవిత చరిత్రను వక్రీకరించారని కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ విషయమై క్రిష్ స్పందించారు. శాతకర్ణి కథ 2 వేల సంవత్సరాల క్రితంది. ఆ చరిత్రకు సంబంధించిన వివరాలు మన వద్ద చాలా తక్కువ ఉన్నాయి. మేము సాధ్యమైనంత మేరకు అన్నివిధాలా సమాచారాన్ని సేకరించి, ఎంతో మంది పరిశోధనాకారులతో మాట్లాడి, ఎన్నో పుస్తకాలు చదివాకే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. తెలిసిన సంఘటనలే తీసుకొని, దాన్ని సినిమాగా మలిచే క్రమంలో కల్పిత సన్నివేశాలు ఉంటాయి. అలా అని శాతకర్ణి కథను వక్రీకరించామని చెప్పలేం. ఒక గొప్ప వ్యక్తి కథను సినిమాగా తీసేప్పుడు రీసెర్చ్ లేకుండా సినిమా అయితే తీయం కదా అన్నారు.

   అలాంటి రూమర్స్ ...

  అలాంటి రూమర్స్ ...

  ‘భాజీరావు మస్తానీ' అనే హిందీ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను తీసుకున్నారన్న రూమర్స్ పై మాట్లాడుతూ... ఇలాంటి పుకార్లు విన్నపుడు నిజంగా బాధేస్తుంది. డబ్బులిచ్చి కొన్ని సన్నివేశాలను భాజీరావు మస్తానీ నుంచి తీసుకున్నామని పుకారొచ్చింది. ఇలాంటి పుకార్లు ఎక్కడ్నించి పుడతాయో కూడా నాకర్థం కాదు. మేం ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఇలా ఏది పడితే అది కల్పించి చెప్పడం మంచిది కాదు అన్నారు.

   నమ్మకమైన నిజం

  నమ్మకమైన నిజం

  ‘‘ఇలాంటి సినిమాలు హిందీలోనే వస్తాయి, అక్కడైతేనే ఒప్పుకొంటారు. తమిళంలో అయితేనే ఆదరణ పొందుతుంటాయి... ఇలా రకరకాల మాటలు వినిపిస్తుంటాయి. అలా మాట్లాడుకొనేవాళ్లందరికీ ఫ్రెండ్లీ వార్నింగ్. ‘గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం. కథని మాత్రమే నమ్మి చేసిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టిన విజయమిది. వారి అభిరుచిపై నమ్మకంతోనే చేసిన సినిమా ఇది. ఆ నమ్మకం నిజం కావడం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు.

   పరిశోధించి తీసిన కల్పితం

  పరిశోధించి తీసిన కల్పితం

  ఈ సినిమా విషయంలో నాకెప్పుడూ భయం లేదు, బాధ్యత మాత్రమే ఉండేది. గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశారనేదానికంటే, ఆయన వ్యక్తిత్వంలోని దృగ్విషయంపైనే ఎక్కువగా దృష్టిపెట్టా. ఆ కీర్తి, ఆయన పంచిన స్ఫూర్తి తెరపైకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకొన్నా. పరిశోధించి తీసిన ఓ కల్పిత కథ ఇది.

   ఆయనకన్నా ఎక్కువ తెలుసా

  ఆయనకన్నా ఎక్కువ తెలుసా

  శాతవాహనుల గురించి ఐదు పుస్తకాలు చదివితే పది కోణాల్లో చరిత్ర కనిపిస్తుంది. ఆ చరిత్ర ద్వారా తెలిసిన విషయాలన్నింటినీ క్రోడీకరించి సినిమాకి అనుగుణంగా కథ రాసుకొన్నాం. శాతవాహనులు తెలుగు వాళ్లే కాదని కొంతమంది వాదిస్తున్నారు. దాని గురించి చర్చే పెట్టదలచుకోలేదు. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రపశస్తిలోనే శాతకర్ణి గురించి చెప్పారు. ఆయనకన్నా ఎక్కువ తెలుసా? కొన్ని విషయాలు చాలా బాధేస్తుంటాయి. ముందు మనల్ని మనం కించపరచుకోవడం మానేయాలి అన్నారు క్రిష్.

   ఆ ఒత్తిడే ఎక్కువ

  ఆ ఒత్తిడే ఎక్కువ

  కొన్ని కథలు కొంతమంది కోసమే పుడుతుంటాయి. అలా ఈ కథ బాలకృష్ణగారి కోసమే పుట్టింది. సినిమా చూశాక ప్రేక్షకులు బాలకృష్ణ తప్ప మరొకరు చేయలేని సినిమా ఇదని చెబుతున్నారు. నాపై నమ్మకంతో తన వందో చిత్రాన్ని చేసే అవకాశాన్నిచ్చారు బాలకృష్ణ. ఆ నమ్మకం నిలబెట్టుకొన్నందుకు ఆనందంగా ఉంది. ఇది బాలయ్య గారి వందో సినిమా అనేదానికంటే శాతకర్ణి కథను చెప్పగలమా? లేదా? అన్న ఒత్తిడే ఎక్కువగా ఉండేది మొదట్లో! ఒక్కసారి సినిమా మొదలయ్యాక ఇక అందరం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఈ ఔట్‌పుట్ తీసుకురాగలిగాం.

   భార్యతో ఎక్కువ సమయం

  భార్యతో ఎక్కువ సమయం

  ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడే నాకు పెళ్లయింది. నా భార్య రమ్యతో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా దక్కలేదు. కానీ తను సినిమా చూశాక చాలా సంతృప్తి చెందింది. మంచి సినిమా చేశావని చెప్పింది. ఆ ప్రశంస నాకు ప్రత్యేకం అనిపించింది అన్నారు క్రిష్.

   అదే రుజువైంది

  అదే రుజువైంది

  ‘‘తెలుగు ప్రేక్షకులు కేవలం కమర్షియల్ అంశాలతో కూడిన సినిమాలే కాదు, మంచి కథ ఉన్న సినిమాలూ చూస్తారనే విషయం మరోమారు మా చిత్రంతో రుజువైంది. ప్రేక్షకుల అభిరుచి గురించి బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఇకపై కూడా నా పంథాలోనే నేను సినిమాలు చేయొచ్చు'' అన్నారు క్రిష్‌.

   ఎక్కడో ఆశ ఉంది

  ఎక్కడో ఆశ ఉంది

  మొదట్లో బాలకృష్ణ వందో సినిమాకు ‘రైతు' అనే సినిమా ఖరారైంది. రైతు అనే సినిమా అనౌన్స్ అవ్వనున్నట్లు నాకూ తెలిసింది. అయితే ఎక్కడో శాతకర్ణి చేస్తారేమో అన్న ఆశ ఉండేది. అనుకున్నట్లుగానే ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పడం అలా జరిగిపోయింది. నిజానికి బాలయ్య వందో సినిమా కాకపోతే శాతకర్ణికి ఈ స్థాయి క్రేజ్ వచ్చేదని నేననుకోను అని క్రిష్ చెప్పుకొచ్చారు.

   గౌతమి పుత్ర ప్లానింగ్ ఇదే

  గౌతమి పుత్ర ప్లానింగ్ ఇదే

  గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని 79 రోజుల్లో తీసినందుకు అంతా మెచ్చుకొంటున్నారు. ఒకే బృందంతో వెంట వెంటనే సినిమా చేయడం మాకు బాగా కలిసొచ్చింది. అదే బృందం తోడయ్యేసరికి మా పని మరింత సులువైంది. సినిమాని నాలుగు భాగాలుగా విభజించి ప్లాన్‌ చేసుకొన్నాం. మొరాకోలో జరిగేదంతా ఒకటిగా, కల్యాణదుర్గంలో జరిగే కథ మరొకటిగా, అమరావతి, ఆ తర్వాత జరిగే కథ... ఇలా ఏ భాగానికి ఆ భాగం విభజించి ఆ మేరకు ప్రణాళికలు వేసుకొని రంగంలోకి దిగాం. మొత్తం మూడు యూనిట్స్‌గా మారి ఒక్కో టీమ్ ఒక్కో భాగంపై పనిచేసేలా చూశాం. షూటింగ్‍లో మెయిన్ టీమ్ ఉంటే, మిగతా రెండు టీమ్స్ తర్వాతి భాగాలకు సంబంధించిన ప్రొడక్షన్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తూ ఉంటుంది. ఇలా ఒక భాగం షూట్ అయిపోగానే, వెంటనే మరో భాగం షూట్ మొదలవుతుంది అంటూ చెప్పుకొచ్చారు క్రిష్.

   పదం బాగుందని చెప్పలేదు

  పదం బాగుందని చెప్పలేదు

  బాలకృష్ణగారు ఈ సినిమాకి పంచభూతాలు సహకరించాయి అని ప్రతి వేదికపైనా చెబుతున్నారు. పదం బాగుందని చెబుతున్న మాట కాదది. నిజంగానే మాకు పంచభూతాలు సహకరించాయి. అందుకే ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించింది. బాలకృష్ణగారు, బుర్రా సాయిమాధవ్‌, జ్ఞానశేఖర్‌, చిరంతన్‌ భట్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రిలతో పాటు, చివర్లో తెరపై కనిపించిన ప్రతి పేరుకీ ఈ సినిమా విజయంలో వాటా ఉంది.

   వెంకటేష్ తో నే

  వెంకటేష్ తో నే

  తదుపరి వెంకటేష్‌ 75వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా. ఆ సినిమా తెరకెక్కడానికి ఇంకా చాలా సమయం ఉంది. అశ్వనీదత్‌ నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ఎవరితో, ఎలాంటి కథ అనేది ఇప్పుడే చెప్పలేను అంటూ వివరించారు దర్శకుడు క్రిష్.

  English summary
  Nandamuri Balakrishna's most anticipated epic drama Gautamiputra Satakarni (Gautami Putra Satakarni/GPSK), released on Thursday, January 12, has opened to tremendous response from movie-goers. Director Kirsh talked about this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X