»   » జగపతి బాబు 'గాయం-2' చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...

జగపతి బాబు 'గాయం-2' చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతి బాబు హీరోగా 'గాయం' చిత్రం సీక్వెల్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ప్రవీణ్ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ బిజీలలో ఉంది. హైదరాబాద్ లోని ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్శిటీలో ఈ చిత్రీకరణ జరుగుతోంది. విమలారామన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు కి కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రోమోలను రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనీల్ భండారి కెమెరా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి గంధం నాగరాజు డైలాగులు రాస్తున్నారు. భారత్ చౌదరి ఆన్ లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.

అలాగే ఈ చిత్రం 'హిస్టరీ ఆఫ్ వయలెన్స్' అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా కథను రూపొందించారని తెలుస్తోంది. కథలో ప్రారంభంలో దుర్గా పాత్ర (జగపతి బాబు)...గూండాగిరికి స్వస్తి చెప్పి బ్యాంకాక్ లో ప్రశాంతంగా హోటల్ నడుపుకుంటూండటంతో ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అలాగే ఈ సీక్వెల్ లో అప్పటి గాయంలో ఉన్న దుర్గ, అతని గ్యాంగ్ పదిహేను సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారనేదే అని చెప్తున్నారు. ఇక కోట తన కుమారుడు కోట ప్రసాద్ తో కలిసి ఈ చిత్రం చేసారు.ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu