For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చేయకూడనవి అన్నీ చేస్తూ పతివ్రతలా నీతులా.. అందుకే బ్రేకప్స్.. పెళ్లంటే భయం.. గాయత్రి గుప్తా

  By Rajababu
  |

  వర్ధమాన నటి గాయత్రి గుప్తా పదేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్న రాని గుర్తింపు ఒక్క యూట్యూబ్ చానెల్‌ ఇంటర్య్యూతో క్రేజ్ వచ్చింది. ఫిదా చిత్రంతో వచ్చిన క్రేజ్‌ను మరింత పెంచుకోవడానికే, ప్రచారం కోసమే మీడియాకు ఎక్కువలో కనిపిస్తుందనే ఆరోపణలపై గాయత్రి ఇటీవల ప్రముఖ టెలివిజన్ చానెల్‌తో ముచ్చటించింది. నటిగా కాకుండా డైరెక్టర్ కావడానికే ఇష్టపడుతాను అని గాయత్రి గుప్తా చెప్పింది. గాయత్రి చెప్పిన మాటలు ఆమె మాటల్లోనే..

  దానికి కమిటైతే అన్నీ ఇస్తామన్నారు.. -‘ఫిదా’ గాయిత్రి
   ధైర్యం అవసరం లేదు

  ధైర్యం అవసరం లేదు

  వేషాల కోసం పడక గదిలోకి పిలిచే సంస్కృతి తెలుగు సినిమా పరిశ్రమలో ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేయడానికి ధైర్యం అవసరం లేదు. ఎందుకంటే ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు రావడానికే ఎంతో ధైర్యం ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు.

   సమాజం గురించి ఆలోచించను

  సమాజం గురించి ఆలోచించను

  ద్వంద ప్రమాణాలున్న ఈ సొసైటీ గురించి ఆలోచించను. నేను అలా మాట్లాడినందుకు ఎలాంటి బాధలేదు. మరోసారి ఆలోచించను. నేను ఒకటి మాట్లాడితే సమాజం మరో విధంగా ప్రచారం చేస్తుంది.

  నేను నాలాగా ఉంటా

  నేను నాలాగా ఉంటా

  పతివ్రతలా బట్టలు వేసుకొని చేయాలిన పనులన్ని చూస్తూ నీతులు చెబుతుంటారు. అలాంటి వారిని చూసి నన్ను చూస్తే ఏంటిరా ఈ పిల్లా తేడాగా ఉంది. ఈ డ్రెస్సింగ్ ఏమిటి అని అనుకొంటారు. నేను నాలాగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. స్లీవ్‌లెస్‌లో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే అదేంటి అలా వచ్చింది అనే మాటలకు నాకు వినిపించాయి.

   ఒక్కసారి భయపడితే ఇక అంతే

  ఒక్కసారి భయపడితే ఇక అంతే

  జీవితంలో భయపడితే నీవు చనిపోయినట్టే. దేనిని ఎదురించలేం. జో డర్ గయా ఓ మర్ గయా అని మా అమ్మ చెబుతుంది. అందుకే నేను దేనికి భయపడను. సభ్య సమాజంలో ఎందరో అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

   గుర్తింపు కోసం పాకులాడను

  గుర్తింపు కోసం పాకులాడను

  నాకు సమాజంలో గుర్తించబడాలి అనే కోరిక లేదు. నేను చేస్తున్న పని నాకు సంతృప్తిని ఇస్తుందా లేదా అని చూసుకొంటాను. గత పదేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నా నాకు గుర్తింపు రాలేదనే భయం లేదు. నేను మాట్లాడిన మాటల వల్ల సినిమా అవకాశాల తగ్గిపోతాయని అనుకొను. ఎందుకంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరిని టార్గెట్ చేయలేదు.

   అబ్బాయిలతోనే ఎక్కువ

  అబ్బాయిలతోనే ఎక్కువ

  నాకు అమ్మాయిల కంటే అబ్బాయిలే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మహిళల సమస్యలపై పోరాడే విషయంపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. సోషల్ సర్వీస్ చేయాలని ఉన్నా నాకు అంత శక్తి లేదు.

   బూతులు మాట్లాడుతానంటే

  బూతులు మాట్లాడుతానంటే

  నేను బూతులు మాట్లాడుతాననే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ అలా మాట్లాడటం తప్పే అయితే నన్ను చాలా మంది అభిమానించరు. ఎంతో మంది అమ్మాయిలు నిన్ను చూసి స్పూర్థి పొందుతున్నాం అని చెబుతున్నారు. నా వ్యక్తిత్వం, నా మాటతీరు నచ్చకపోతే అలా మెసేజ్‌లు పంపరు. నాకు అందుకే బూతుల మీద రెస్సెక్ట్ ఏర్పడింది. బూతులు తిడితే ఎమోషనల్‌గా ధైర్యమిస్తుంది.

  లైఫ్‌లో చాలా బ్రేకప్స్

  లైఫ్‌లో చాలా బ్రేకప్స్

  ముక్కుసూటిగా వ్యవహరించడం వల్లే నా లైఫ్‌లో అనేక బ్రేకప్స్ జరిగాయి. నా మనసులో ఒకటుంటే మరొకటి మాట్లాడను. బ్రేకప్ తర్వాత ఓ సారి డిప్రెషన్‌లోకి వెళ్లి నేను చేయి కోసుకొన్నాను. అప్పుడు నా పరిస్థితి చాలా గందరగోళంలో ఉన్నప్పుడు నాకు నైతికంగా ఎవరూ మద్దతు ఇవ్వలేదు.

   నాకు పెళ్లి అంటే భయం

  నాకు పెళ్లి అంటే భయం

  పెళ్లి, సంసారం అంటే నాకు భయం. నా కుక్క పిల్లకు జ్వరం వస్తే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది నా పిల్లలకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నన్ను నన్నుగా ప్రేమించే వారుంటే వారికి దగ్గరవుతాను. అంతేగానీ సోకాల్డ్‌గా ఉండే వ్యక్తులు చూస్తే అసహ్యమేస్తున్నది.

   సమాజంలో మీడియా కూడా

  సమాజంలో మీడియా కూడా

  సమాజంలో మీడియా శక్తిమంతమైనది. ఓ టెలివిజన్ ఛానెల్‌లో మాట్లాడితే వారు మరో రకంగా ప్రసారం చేశారు. నేను చెప్పినదానికి భిన్నంగా ప్రసారం చేశారు. దాంతో సానుకూల పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. మీడియా అలా పక్షపాతంగా వ్యవహరించకూడదు.

  English summary
  ollywood's budding star Gayathri Gupta now hot in the media. This Fidaa star, Revealed casting couch incidents in Tollywood and bollywood. She Said in her latest interveiw, Bollywood film unit offers, flat and Car. If she goes to 12 days bed for role. She gave some clarification about her comments in latest media interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X