twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుడి ఎనుకా నా సామీ.. గజల్ శ్రీనివాస్ అరెస్ట్ వెనుక ఆసక్తికరమైన కోణం.. నమ్మించ్చి బోల్తా..

    By Rajababu
    |

    ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలున్న గజల్ శ్రీనివాస్ ఒక్క కేసుతో పరువు కుప్పకూలిపోయింది. ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా సంపాదించుకొన్న ఖ్యాతి మట్టిలో కొట్టుకుపోయిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నండగా, మరికొందరు ఇంత దరిద్రానికి పాల్పడుతాడా అని ఛీ కొడుతున్నారు. గజల్ శ్రీనివాస్ అరెస్ట్ వెనుక పోలీసులు వ్యవహరించిన తీరు చాలా ప్రశంసనీయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గజల్ అరెస్ట్ వెనుక పోలీసులు అనుసరించిన వ్యూహం ఇదే..

    Recommended Video

    గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు
    నమ్మించి బోల్తా కొట్టించిన

    నమ్మించి బోల్తా కొట్టించిన

    ఎన్నో నెలలుగా వేధింపులకు గురవుతున్న బాధితురాలు గజల్ శ్రీనివాస్‌ను పక్కాగా నమ్మించి బుట్టలో వేసింది. ఏ మాత్రం అనుమానం రాకుండా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

    రాసలీల రికార్డు టేపులతో

    రాసలీల రికార్డు టేపులతో

    గజల్ శ్రీనివాస్ రాసలీలలను పక్కాగా రికార్డ్ చేసుకొన్నానని ధృవీకరించుకొన్న తర్వాత బాధితురాలు టేపులతో సహా బయపడింది. డిసెంబర్ 29 తేదీన ఆధారాలతో సహా పోలీసులకు అందించి ఫిర్యాదు చేసింది.

    బాధితురాలి ఫిర్యాదుపై

    బాధితురాలి ఫిర్యాదుపై

    బాధితురాలి అందించిన వివరాలను, ఆధారాలను పోలీసులు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసుకోవడమే కాకుండా ముందస్తుగానే ఎఫ్‌ఐఆర్‌ను కూడా సిద్ధం చేశారట. అరెస్ట్‌కు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారట.

    అదును చూసి అరెస్ట్

    అదును చూసి అరెస్ట్

    గజల్ శ్రీనివాస్, నంబర్ టూ నిందితురాలి వివరాలను, ఆచూకీని పక్కాగా సరిచూసుకొన్నారట. డిసెంబర్ 30, 31 తేదీన ఇద్దరు కూడా అందుబాటులో లేకపోవడంతో అరెస్ట్ ఆలస్యమైందట. ఏపీ నుంచి గజల్ శ్రీనివాస్ వచ్చిన తర్వాత అదనుచూసి అరెస్ట్ చేశారట.

    ఏపీలోనే అరెస్ట్ చేయాలని

    ఏపీలోనే అరెస్ట్ చేయాలని

    బాధితురాలి ఫిర్యాదు అందుకొన్న వెంటనే ఏపీలోనే గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారట. అయితే ఏపీలో ఆయనకు పలుకుబడి ఉండటం, అంతేకాకుండా అక్కడ ఈ విషయం లీకైతే ఏపీ నుంచి తీసుకురావడం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చేరేంత వరకు గజల్‌పై నిఘా పెట్టారట.

    గజల్ శ్రీనివాస్ ధీమాగానే

    గజల్ శ్రీనివాస్ ధీమాగానే

    లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ తర్వాత కూడా గజల్ శ్రీనివాస్ ధీమా సడలదేట. పోలీసు స్టేషన్‌లో నాకేమవుతుందనే విశ్వాసంతో కనిపించారట. టేబుల్‌పై తబలా కొడుతూ చాలా ఉల్లాసంగా వ్యవహరించారట.

    గజల్ శ్రీనివాస్ నీరుకారిందిలా

    గజల్ శ్రీనివాస్ నీరుకారిందిలా

    అయితే ఒక్కొక్కటిగా వీడియోలు, ఫొటోలు, ఆడియో టేపులు బయటపెట్టడంతో గజల్ శ్రీనివాస్ ఒక్కసారిగా నీరుకారిపోయాడట. కేసు నుంచి బయటపడేందుకు పోలీస్ స్టేషన్‌లోనే తన హోదాను, పరపతి ఉపయోగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారట.

    ఒత్తిడులకు తలొగ్గకుండా

    ఒత్తిడులకు తలొగ్గకుండా

    అయితే హైదరాబాద్ పోలీసులు ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వెంటనే గజల్ శ్రీనివాస్‌ను జైలుకు తరలించడంలో అధికారులు చాకచక్యంగా వ్యవహరించారట. దీంతో గుడి ఎనుకా నా సామీ బండారం ఒక్కసారిగా బట్టబయలైంది.

    వేధింపులపై సర్కార్ సీరియస్

    వేధింపులపై సర్కార్ సీరియస్

    లైంగిక వేధింపుల కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకొంటున్నది. ఇప్పటికే జూదం, పేకాట లాంటి వాటిపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    గజల్ శ్రీనివాస్ వ్యవహారం కష్టమే

    గజల్ శ్రీనివాస్ వ్యవహారం కష్టమే

    లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ సులభంగా బయటపడే అవకాశం లేనట్టు కనిపిస్తున్నది. బలమైన సెక్షన్లు పెట్టడంతో ఈ కేసులో వెంటనే బెయిల్ కూడా రావడం కష్టమే అనే మాట వినిపిస్తున్నది.

    English summary
    The 29-year-old complainant, a program head at Srinivas' AalayaVani Web Radio company, alleged that Srinivas has been sexually harassing her for a long period of time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X