మీరేమైనా అనుకోండి... నేను స్టిల్ వర్జిన్: విజయ్ దేవరకొండ

By Bojja Kumar

Recommended Video

Vijay Deverakonda's Geetha Govindam New Poster Released

'అర్జున్ రెడ్డి' చిత్రంతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా, నోటీ, డియర్ కామ్రెడ్, గీతా గోవిందం చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా 'గీతా గోవిందం' మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. మీరేమైనా అనుకోండి నేను స్టిల్ వర్జిన్ అంటూ విజయ్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టర్ షేర్ చేశారు.

మీరేమైనా అనుకోండి నేను స్టిల్ వర్జిన్

ఈ చిత్రం విజయ్ గోవింద్ పాత్రలో, ‘ఛలో' ఫేం ర‌ష్మిక మండన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. బ‌న్నివాసు నిర్మాత. అల్లు అర‌వింద్ అసమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సినిమా గురించి అల్లు అరవింద్

సినిమా గురించి అల్లు అరవింద్

అర‌వింద్ మాట్లాడూతూ.. "గీతగోవిందం" చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మరింత పేరు తెచ్చిపెడుతుంది. విజ‌య్ చాలా ఫ్యాష‌న్ వున్న హీరో. పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప‌రుశురాం మా బ్యాన‌ర్ లో రెండ‌వ చిత్రం చేస్తున్నాడు. హీరోయిన్ ర‌ష్మిక పాత్ర పేరు గీత‌.. ఈ చిత్రం త‌రువాత త‌న‌ని గీత అని పిలుస్తారు అంత‌బాగా పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసింది. ప‌రుశురాం మంచి క‌మిట్‌మెంట్ వున్న ద‌ర్శ‌కుడు. గోపిసుంద‌ర్ సంగీతం బాగుంది. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ చెయ్య‌ని విభిన్న‌మైన షెడ్స్‌లో విజయ్

ఇప్ప‌టి వ‌ర‌కూ చెయ్య‌ని విభిన్న‌మైన షెడ్స్‌లో విజయ్

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ... గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం త‌రువాత ఈ చిత్రం చేస్తున్నాను. గీత గోవిందం చిత్రాన్ని రోమాంటిక్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు అగ‌ష్టు 15న తీసుకువ‌స్తున్నారు. విజ‌య్ దేవ‌ర కొండ గోవిందం అనే పాత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ చెయ్య‌ని విభిన్న‌మైన షెడ్స్ లో క‌నిపిస్తాడు. అర్జున్ రెడ్డి త‌రువాత విజ‌య్ ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడు అనే క్యూరియాసిటి అంద‌రితో పాటు నాకు వుంది. అందుకే చాలా జ‌గ్ర‌త్త‌గా త‌న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర‌ని డిజైన్ చేశాను. గీత పాత్ర‌లో రష్మిక ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసింది అన్నారు.

తెర ముందు, తెరవెనక

తెర ముందు, తెరవెనక

న‌టీన‌టులు..
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...

సాంకేతిక నిపుణులు..
స‌మ‌ర్ప‌కులు.. అల్లు అర‌వింద్‌
నిర్మాత‌.. బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం... ప‌రుశురామ్‌
సంగీతం.. గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌.. మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌.. ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. స‌త్య గ‌మిడి
స్క్రిప్ట్ కొ-ఆర్డినేట‌ర్‌.. సీతారామ్‌
లిరిక్స్‌.. అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి,
కొరియోగ్రాఫి... ర‌ఘు, జాని

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X