twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీరవాణిగారు నన్ను 'దయ్యం' అని పిలుస్తారు.

    By Srikanya
    |

    Geetha Madhuri
    హైదరాబాద్ : అవకాశాలెప్పుడూ చెప్పి రావు. కీరవాణి గారి దగ్గర పాడటం అలాంటిదే. 'ఛత్రపతి'లో కోరస్‌ పాడేందుకు ఆయన దగ్గరికెళ్లా. 'ఖతర్నాక్‌'లో అవకాశం ఇచ్చారు. కొంతకాలానికే 'మగధీర'లో రెండు పాటలు పాడమన్నారు. అందులో పాడిన 'జోర్‌సే... జోర్‌సే', 'నాకోసం నువ్వు' చాలా ఆదరణ పొందాయి. ఆ తరవాత కూడా 'రాయే సలోనీ' 'తెలుగమ్మాయి..' లాంటివీ పాడా. అవన్నీ నాకు ఇంకా అవకాశాలు వచ్చేలా చేశాయి. కీరవాణి గారికి గాయకుల చేత ఎలా పాడించుకోవాలో తెలుసు. నన్ను వాళ్లింట్లో అమ్మాయిలా చూస్తారు. సరదాగా 'దయ్యం' అని పిలుస్తారు. పాటలు పాడుతున్నప్పుడు మాత్రం సందర్భాన్ని బట్టి 'నెలల పసిగుడ్డును చేత్తో ఎత్తుకున్నంత సున్నితంగా పాడాలి' అనీ, 'ఆనందంగా గాల్లో తేలిపోతున్నట్లు ఉండాలి నీ గొంతు' అనీ సూచనలు చేస్తారు. ఇవి కేవలం పాటలకే కాదు... నాకు జీవితాంతం ఉపయోగపడతాయి అంటూ చెప్పుకొచ్చారు గీతా మాధురి.

    అలాగే ఇప్పటి వరకూ దాదాపు అందరు సంగీత దర్శకుల వద్దా పని చేశాను. ప్రతి ఒక్కరి నుంచీ ఏదో ఒకటి నేర్చుకున్నా. కీరవాణి గారి దగ్గర పని విషయంలో క్రమశిక్షణ చూశా. మణిశర్మ గారి దగ్గర 'చిరుత', 'రచ్చ' కోసం పాడా. 'చమ్కా, చమ్కా', డిల్లకు డిల్లా..' లాంటివీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దేవీశ్రీ గారు 'డార్లింగే...' పాడించారు. సరదాగా ఉంటూనే తనకు కావల్సినట్టుగా పాడించుకోవడం ఆయన తత్వం. ఆర్పీగారికి వర్తమాన వ్యవహారాలపై అవగాహన ఎక్కువ. అవన్నీ చెబుతుంటారు. తమన్‌ గారు కొత్త స్వరాలు సమకూరుస్తారు. సరికొత్త గ్యాడ్జెట్లను చూపిస్తారు అంటూ మిగతా సంగీత దర్శకుల గురించి చెప్పుకొచ్చారామె.

    ఇళయరాజా గురించి చెప్తూ.... కేవలం గాయకులకే కాదు.. పేరున్న సంగీత దర్శకులకు కూడా ఇళయరాజా గారి దగ్గర పనిచేయాలనే కోరిక ఉంటుంది. ఒక గాయనిగా నేనందుకు మినహాయింపు కాదు. నేనొక వైపు సినిమాల్లో పాడుతూనే 'ప్రియా ప్రియతమా రాగాలు' వంటి పోటీల్లో పాల్గొన్నా. 'సై సింగర్స్‌ ఛాలెంజ్‌'లో ఫైనల్స్‌ వరకూ చేరుకున్నా. ఇవన్నీ నాకు ఇళయరాజా గారి దగ్గర పాడే అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. అదే 'గాయం 2'. ఆయన దగ్గర పాడబోతున్నానని తెలిశాక ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. తప్పు పాడితే ఆయన వెంటనే చెప్పేస్తారనీ, చాలా కోపంగా ఉంటారనీ చాలామంది అంటారు. నాకు అలాంటి సందర్భమే ఎదురుకాలేదు.

    'నమస్తే' అంటే ప్రశాంతంగా నవ్వేవారు. 'ఎందుకమ్మ ప్రేమా ప్రేమా' అంటూ ఆయన వద్ద పాడిన పాట హిట్టయ్యింది. ఆయన వద్ద మళ్లీ ఎప్పుడు పాడతానా అని ఎదురుచూసిన నాకు కిందటేడాది ఆ ఛాన్సు లభించింది. ప్రతి సంవత్సరం బెంగళూరులో వినాయకచవితి పండగను భారీ ఎత్తున చేస్తారు. అప్పుడు తమిళ, కన్నడ, తెలుగు గాయనీ గాయకులు అక్కడికొచ్చి పాడతారు. ఆయనతో కలిసి కార్యక్రమంలో పాల్గొని, పాటలు పాడాను. ఈసారి నన్నాయన గుర్తు పెట్టుకున్నారు. 'గుండెల్లో గోదారి'లో 'వెచ్చాని వయసు' పాడాలంటూ పిలిపించారు. అమెరికాలో ఆయన నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకూ నన్ను తీసుకెళ్లారు. హరిహరన్‌, బాలూగారూ, చిత్రగారూ... ఇలా పెద్దపెద్ద గాయనీగాయకులంతా వచ్చారు. అక్కడ ఇళయరాజా గారి గురించి ఓ చిన్న పుస్తకంలో గొప్పగా రాశారు. అందులోనే నా గురించీ చిన్న పేరాగ్రాఫ్‌ రాశారు. అది చదివి మురిసిపోయా. ఒక గాయనిగా నాకు లభించిన అపురూపమైన, అరుదైన అదృష్టం అది అంది.

    తన లవ్ స్టోరీ చెప్తూ... నాకూ, నటుడు నందూకి అనుకోకుండా పరిచయమైంది. అది స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకోవాలనుకుని మా పెద్దవాళ్లకు చెప్పాం. గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. అతనే కాదు, అతని కుటుంబసభ్యులు కూడా అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తారు. అలాంటి ఇంటికి కోడలిగా వెళ్లబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ వివరించింది.

    English summary
    The industry is buzzing with the news that famous singer Geetha Madhuri and actor Nandu are going to enter wedlock very soon. Though the news had been making rounds, it was confirmed by Geetha Madhuri now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X