»   »  ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం (ఫోటోలు)

ప్రియుడితో సింగర్ గీతా మాధురి వివాహం (ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ప్రముఖ గాయని గీతామాధురి వివాహం నటుడు నందుతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆర్పీ పట్నాయక్, ఎస్. జానకితో పాటు పలువురు హాజరయ్యారు.

  గత కొంత కాలంగా గీతా మాధురి, నందు ప్రేమించుకుంటున్నారు. వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇరు వర్గాల పెద్దలు అంగీకారంతో జీవిత భాగస్వాములయ్యారు. నటుడిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నందు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన 'ఫోటో' సినిమాతో తెరంగేట్రం చేసారు.

  ఆమధ్య వచ్చిన '100% లవ్' సినిమాతో నందు గుర్తింపు తెచ్చుకున్నాడు. 100% అందులో తమన్నాను ప్రేమించే యువకుడిగా నందు నటించాడు. కాగా... ఇటీవలే 'అదితి' అనే లఘు చిత్రంలో నందు, గీతామాధురి కలిసి నటించారు. ఇప్పటి వరకు సింగర్ గీతా మాధురిని కేవలం తెర వెనక సింగర్ గా మాత్రమే పరిమితం అయింది. ఇప్పుడు ఆమె తన కాబోయే భర్త నందుతో షార్ట్ ఫిలింస్‌లో నటించడం చూస్తూ ఇద్దరూ కలిసి కట్టుగా నటనా రంగంలో ఎదగాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  గీతా మాధురి, నందు వివాహాలకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో.....

  గీతా మాధురి, నందు

  గీతా మాధురి, నందు


  గీతా మాధురి, నందు వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న దృశ్యం ఇక్కడ చూడొచ్చు.

  రాఘవేంద్రరావు

  రాఘవేంద్రరావు


  ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కె. రాఘవేంద్రరావు నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యం.

  ఎస్ జానకి

  ఎస్ జానకి


  ప్రముఖ గాయని ఎస్. జానకి నూతన దంపతులు గీతామాధురి, నందులను ఆశీర్వదిస్తున్న దృశ్యం.

  కీరవాణి దంపతులు

  కీరవాణి దంపతులు


  నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కీరవాణి దంపతులు.

  అభినందనలు

  అభినందనలు


  కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు...

  గుండు హనుమంతరావు

  గుండు హనుమంతరావు


  నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న నటుడు గుండు హనుమంతరావు

  సాంప్రదాయం

  సాంప్రదాయం


  సాంప్రదాయ పద్దతిలో పెళ్లి కూతురును కళ్యాణ మంటపానికి తీసుకొస్తున్న దృశ్యం.

  రాఘవేంద్రరావు, కీరవాణి

  రాఘవేంద్రరావు, కీరవాణి


  వివాహ వేడుకలో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, కీరవాణి.

  ప్రముఖులు

  ప్రముఖులు


  గీతా మాధురి, నందు వివాహ వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు

  కన్వెన్షన్ సెంటర్‌

  కన్వెన్షన్ సెంటర్‌


  గీతామాధురి వివాహం నటుడు నందుతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని శుభం కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది.

  సింగర్ సునీత

  సింగర్ సునీత


  గీతా మాదురి, నందు వివాహ వేడుకకు హాజరైన ప్రముఖ గాయని సునీత

  English summary
  
 Telugu playback singer Geetha Madhuri entered into wedlock with actor Nandu (Anand of 100% Love fame) on the night of 9 February 2014 at a function held at Subham convention hall, Nagole, Hyderabad. Lot of film personalities attended this wedding
 Geetha Madhuri and Nandu have been seeing each other for past few years, but the rumours about their relationship started doing rounds a year ago. Although the couple has been spotted together on various occasion, they were keeping mum on their love affair.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more