»   » డ్రగ్స్ కేసులో నందూ పేరున్నందుకు నేను భయపడలేదు: గీతా మాధురి

డ్రగ్స్ కేసులో నందూ పేరున్నందుకు నేను భయపడలేదు: గీతా మాధురి

Posted By:
Subscribe to Filmibeat Telugu
నందూ అలాంటివాడు కాదు -గీతామాధురి

చల్లగా సాగుతున్న టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఒక్కసారిగా పెద్ద అలజడినే సృష్టించింది. పూరీ జగన్నధ్, నవదీప్, లాంటి నటుల పేర్లు వచ్చినప్పుడు కూడా ఆశ్చర్యపోని జనాలు సింగర్ గీతా మాధురి భర్త, నటుడూ, గాయకుడు నందూ పేరు వినిపించగానే షాక్ తిన్నారు.

 డ్రగ్స్ తీసుకునేంత దారి తప్పలేదు

డ్రగ్స్ తీసుకునేంత దారి తప్పలేదు

డ్రగ్స్ కేసులో తన భర్త పేరు టీవిల్లో చూసి షాక్ అయ్యానని అసలు తన భర్తకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేనే లేదనీ. డ్రగ్స్ తీసుకునేంత దారి తప్పలేదని గీతామాధురి మీడియాకు క్లారిటీ ఇచ్చింది. డ్రగ్స్ ముఠాతో నందూకి ప్రమేయముందన్న వార్తల్ని కూడా ఆమె తప్పుబట్టారు.

 పూర్తి నమ్మకం ఉంది

పూర్తి నమ్మకం ఉంది

నిజానిజాలు తేలకుండా దోషులుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదని, తన భర్తపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆ వివాదంతో తన ఫ్యామిలీ మొత్తం షాక్‌లో పడిపోయిందని చెప్తూ, ఆ మొత్తం వ్యవహారం లోనూ భర్తకి అండగా నిలబడింది . అలాంటి గీతామాధురి తాజాగా ఒక వెబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ తో పాటు కుటుంబ సంబంధమైన విషయాలను కూడా పంచుకుంది గీతా మాధురి.

 నందూ ఎలాంటివాడో నాకు తెలుసు

నందూ ఎలాంటివాడో నాకు తెలుసు

"నందూను డ్రగ్స్ కేసులో ఇంటరాగేషన్ కి పిలిచినప్పుడు ఎలా ఫీలయ్యారు" అనే ప్రశ్నకి ఆమె తనదైన శైలిలో స్పందించింది. నందూ ఎలాంటివాడో తనకి పూర్తిగా తెలుసనీ .. తన దగ్గర ఆయన ఏ విషయాలను దాచడని చెప్పింది. నందూపై తనకి పూర్తిగా నమ్మకం ఉండటం వలన, ఎంత మాత్రం భయం లేకుండా ధైర్యంగా వున్నానని అంది.

 డ్రగ్స్ కేసులో నందూ పేరు వినిపించడం

డ్రగ్స్ కేసులో నందూ పేరు వినిపించడం

అయితే అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ కేసు విషయంలో నందూ పేరు వినిపించడం, తన అత్తింటివారికి బాధను కలిగించిందని చెప్పింది. నిప్పులేకపోయినా పొగ వస్తుందనే విషయం ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి తనకి అర్థమైందని చెప్పుకొచ్చింది.

English summary
Playback Singer Geetha Madhuri clarification while an Interview About Her Husband Nandu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu