»   » జెనీలియా ట్విస్ట్ ఇవ్వబట్టే సమంత అలా

జెనీలియా ట్విస్ట్ ఇవ్వబట్టే సమంత అలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంత రీసెంట్ గా బాలీవుడ్ కి వెళ్తోందని వార్త, ఆ వెంటనే లేదు..లేదు ..ఇక్కడే హ్యాపీ గా ఉందని ఆమె ప్రకటించటం వెనువెంటనే జరిగిపోయింది.అయితే అస్సలు విషయం వేరే జరిగిందంటున్నారు. సమంతకు బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయింది. దాంతో వెంటనే ప్లేటు ఫిరాయించి సమంత తనకు అస్సలు బాలీవుడ్ అంటే ఆసక్తి లేనట్లు ప్రస్తుతం ఇక్కడే సెటిల్ కావాలనుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చేసింది.ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 'బోల్ బచ్చన్" సినిమాలో అజయ్ దేవగణ్ సరసన సమంతాకు ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం సింగం రీమేక్ చేస్తున్న రోహిత్ శెట్టి ఈ కామిడీని తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే హీరో అజయ్ దేవగన్ కాస్త తెలిసున్న ఫేస్ అయితే బెస్ట్ అనటంతో జెనీలియా వచ్చి చేరింది.ఈ చిత్రాన్ని రామోజి ఫిల్మ్ సిటిలో ఆగస్టు ఇరవై నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సమంతా ఈ విషయాన్ని కవర్ చేసుకుంటూ, అసలు తాను హిందీ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించనేలేదని చెప్పింది.

English summary
Samantha is certainly not romancing Ajay Devgan and Abhishek Bachchan in Rohit Shetty’s Bol Bachchan that is going on floors on August 20 at the Ramoji Rao Film City in Hyderabad. The two leading ladies finalized for this comedy film are Asin Thottumkal and Genelia D’Souza.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu