»   » హీరోయిన్ జెనీలియా పెంపుడు కుక్క వైభోగం చూస్తిరా...!

హీరోయిన్ జెనీలియా పెంపుడు కుక్క వైభోగం చూస్తిరా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ జెనీలియాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఒక జాతి కుక్కను కూడా ప్రేమగా పెంచుకుంటోంది. దాని పేరు ఫ్లాష్. ఇటీవల దాని పుట్టినరోజు వేడుకను ఎంతో గ్రాండ్ గా చేసింది. చూసారుగా దాని వైభోగం.... కనీసం బర్త్ డే భాగ్యానికి కూడా నోచుకోని కొందరు సమాన్య జనం... పుడితే ఇలాంటి హీరోయిన్లకు కుక్కగా పుట్టినా ఫర్వాలేదు అని కుళ్లుకుంటున్నారట.

Genelia celebrates Birthday of Flash!

సౌత్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన జెనీలియా... తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌మఖ్‌ను పెళ్లాడటం తెలిసిందే. వారికి రియాన్ అనే బాబు కూడా. తాజాగా జెనీలియా మళ్లీ గర్భవతి అయింది. పెళ్లయిన దగ్గర నుండి జెనీలియా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

రియాన్ పుట్టిన తర్వాత జెనీలియా మళ్లీ సినిమాల్లోకి వస్తుందని అంతా భావించారు. అయితే ఆమె మరోసారి గర్భం దాల్చడం బట్టి చూస్తే ఇప్పట్లో ఆమె రీఎంట్రీ ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరో బిడ్డ పుట్టిన తర్వాత రితేష్, జెనీలియా దంపతులు కుటుంబ నియంత్రణ పాటించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

'తుజే మేరీ కసమ్‌'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్‌, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. నవంబర్ 25, 2014న రియాన్ జన్మించాడు. ఈ బుడతడు ఇంకా బాలీవుడ్లో అడుగు పెట్టక పోయినా బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. బాలీవుడ్ సర్కిల్ లో షారుక్ ఖాన్ కొడుకు అబ్ రామ్ తర్వాత, ఆ రేంజిలో సెలబ్రిటీ కిడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రియాన్.

English summary
Genelia made her pet dog feel so special by arranging a cake with a candle on top of it, to mark its birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu