Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోయిన్ జెనీలియా న్యూ బోర్న్ బేబీ ఫస్ట్ లుక్ (ఫోటోస్)
ముంబై: హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ దంపతులు గత నెలలో మరో బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే రియాన్ అనే రెండేళ్ల బాబు ఉండగా...రెండో బాబుకి రహైల్ అని పేరు పెట్టారు.
రహైల్ జన్మించి దాదాపు రెండు నెలలు గడిచినా...ఇప్పటి వరకు ఫొటోలు మీడియాకు రిలీజ్ చేయలేదు. తాజాగా జెనీలియా తన సోషల్ మీడియా ద్వారా రహైల్ ఫోటో పోస్టు చేసింది. జెనీలియా ముద్దాడుతున్నట్లు ఉన్న ఈ ఫోటోలో రహైల్ ముఖం మాత్రం కనిపించడం లేదు.
బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమని గతంలో ప్రకటించింది. ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందనే ఆనందం అభిమానులకు ఎంతో కాలం నిలవలేదు. జెనీలియా మళ్లీ గర్భం దాల్చడం, తాజాగా మరో బాబుకు జన్మనివ్వడంతో ఆమె ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశాలే లేవని తేలిపోయింది.
జెనీలియా ఎక్కువ పాపులర్ అయింది సౌత్ లోనే. ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు కలిసి రాలేదు. ఇక 'తుజే మేరీ కసమ్' చిత్రంతో రితేశ్, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. 2014 నవంబర్ లో వీరికి రియాన్, 2016 జూన్ 1న రహైల్ జన్మించాడు.
స్లైడ్ షోలో ఫోటోస్...

జెనీలియా, రహైల్
రహైల్ ఫస్ట్ లుక్ ఫోటో ఇదే... తన బిడ్డను ముద్దాడుతూ జెనీలియా మురిసిపోతోంది.

రహైల్
తన రెండో బిడ్డకు రహైల్ అని నామకరణం చేసారు జెనీలియా, రితేష్

రియాన్
తండ్రి రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి రియాన్ దేశ్ ముఖ్.

క్యూట్
రియాన్ ఫోటోలను తల్లిదండ్రులిద్దరూ తరచూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటంతో రియాన్ కూడా సెలబ్రిటీ అయిపోయాడు.

రితేష్, జెనీలియా
'తుజే మేరీ కసమ్' చిత్రంతో రితేశ్, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. 2014 నవంబర్ లో వీరికి రియాన్, 2016 జూన్ 1న రహైల్ జన్మించాడు.