»   »  హీరోయిన్ జెనీలియా గర్భవతైందా?

హీరోయిన్ జెనీలియా గర్భవతైందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ జెనీలియా గర్భవతైందా? ఆమె త్వరలో తల్లికాబోతోందా? అనే వార్తలు ఇపుడు బాలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల జెనిలియా, ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ కలిసి మరాఠి చిత్రం 'ఎల్లో' చిత్రం స్పెషల్ స్ర్కీనింగుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెనీలియా పొట్ట భాగం కాస్త ఉబ్బెత్తుగా కనిపించడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

గతంలోనూ జెనీలియాపై ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఏమీ లేదని, ఇంకొంతకాలం ఫ్యామిలీ ప్లానింగ్ కొనసాగిస్తామని అప్పట్లో వివరణ ఇచ్చింది. తాజాగా వచ్చిన వార్తలపై జెనీలియా స్పోక్ పర్సన్ మాట్లాడుతూ....ఈ వార్తలను ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు.

 Genelia D'Souza Shows Baby Bump?

ఈ మధ్య హీరోయిన్లు....ఎక్కడ కనిపించినా వారికి సంబంధించిన ప్రతి అంశంపై మీడియా వారు బాగా ఫోకస్ చేస్తున్నారు. వారి శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించినా, వారు ఎవరిని కలిసినా....టముకు వేసి ఉన్నవి, లేనివి జోడించి మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య విద్యా బాలన్ విషయంలోనూ ఇలాంటి ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

జెనీలియా విషయానికొస్తే...ఒకప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలైన తెలుగు, తమిళంలో తన హవా కొనసాగించిన జెనీలియా హిందీ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన తర్వాత దక్షిణాది సినిమాలకు పూర్తిగా దూరమైంది. హిందీ సినిమాల్లో కూడా ఆమె యాక్టివ్‌గా లేదు. భర్తకు సంబంధించిన సినీ నిర్మాణ సంస్థ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

English summary
D'Souza, who has been married to fellow Bollywood actor Riteish Deshmukh for two years, has now sparked off pregnancy rumours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu