»   » జెనిలీయాని ఆ హీరో 'ఫోర్స్‌'చేస్తున్నాడు

జెనిలీయాని ఆ హీరో 'ఫోర్స్‌'చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెనిలియా ఇప్పుడు మలేషియాలో రానా షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే ఆమె హిందిలో చేసిన 'ఫోర్స్‌'చిత్రం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో ఆ పార్ట్ ని పూర్తి చేయమని చిత్ర హీరో జాన్ అబ్రహమ్ ఫోన్ లుచేసి బ్రతిమిలాడుతున్నాడు.అయితే జెనీలియా ప్రస్తుతం ఖాలీ లేదు కొద్ది కాలం ఆగాలని చెప్తోందిట.ఇంతకీ 'ఫోర్స్‌'సినిమా తమిళ 'కాక్క కాక్క' (తెలుగులో ఘర్షణ) చిత్రానికి రీమేక్‌.జాన్‌ అబ్రహమ్‌ సినిమాలేమీ ఈ మధ్య కాలంలో విడుదల కాలేదు. దాంతో అతను ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు.

కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జెనిలియా డేట్స్ అయిపోయాయి కానీ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు.టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. కాకపోతే రెండు పాటలు బ్యాలెన్స్ ఉంది. వీటిలో ఒకటి జెనీలియా మీద ఇంట్రడక్షన్ సాంగ్, మరోటి జాన్‌, జెనీలియా మధ్య వచ్చే శృంగార గీతం. జెనీలియా కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోవటంతో 'ఫోర్స్‌' విడుదల తేదీని వాయిదా వేసుకోవల్సి వస్తోంది. నిర్మాత ,హీరో జెనీలియాతో సంప్రదింపులు చేస్తున్నారు. కాస్త ఖాళీ చేసుకొంటే మా చిత్రం సెప్టెంబరులో వచ్చేస్తుందని ఆయన జెన్నీని బ్రతిమాలుతున్నట్లు సమాచారం. నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వంలో 'ఫోర్స్‌'చిత్రం తెరకెక్కుతోంది.

English summary
John Abraham has huge expectations from Nishikant Kamat's next, Force. The entire movie is done except for two songs featuring Genelia, who has not been able to dole out dates for the shoot.
Please Wait while comments are loading...