»   » ఆరెంజ్ ప్లాప్ పై మరో విషయాన్ని బయటపెట్టిన నాగబాబు..

ఆరెంజ్ ప్లాప్ పై మరో విషయాన్ని బయటపెట్టిన నాగబాబు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆరెంజ్" సినిమా నిర్మాత, అంజనా ప్రొడక్షన్స్ అధినేత, సినీ నటుడు నాగబాబు, 'మిరపకాయ్" ాడియో విడుదల వేడుకలో 'కొందరు దర్శకుల్ని" ఉద్దేశించి సినీ పరిశ్రమకు వైరస్ లా తయారయ్యారంటూ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమయ్యాయి. సినిమా మీద గ్రిప్ లేకుండా దర్శకులు, నిర్మాతల్ని కాల్చుకు తినేస్తున్నారనీ, అవగాహన లేకుండా కోట్లు తగలేస్తున్నారనీ, నిర్మాత నాశనమైపోతున్నాడని నాగబాబు పరోక్షంగా 'ఆరెంజ్" దర్శకుడు భాస్కర్ పై మండిపడ్డ సంగతి విదితమే.

తాజాగా మరో కారణం చూపుతున్నాడు, కొద్ది రోజుల క్రితం జెనీలియా మదర్ బర్త్ డే గ్రాండ్ గా జరుపుకొన్నది. అక్కడి కొంతమంది సినీ స్టార్స్ ను కూడా ఇన్ వైట్ చేసింది. అప్పుడు ఉన్నపరంగా 'ఆరెంజ్" సినిమా గురించి మాట్లాడుతూ సినిమా లేటవుతోంది కనుక తన కూతురికి మరో పది లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. సినిమా అనుకున్న ప్రకారం కాకుండా, నత్తనడకన షూటింగ్ సాగడం, షూటింగ్ జరగాల్సిన రోజులు పెరిగిపోవడంతో, హీరోయిన్ జెనీలియా ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని నాగబాబు అసలు విషయం కాస్త లేటుగా చెప్పుకొచ్చారు. అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే సినిమా మధ్య లో జెనీలియాను తీసికెళ్ళిపోతానంటూ జెనీలియా మదర్ బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమెకు ఎక్స్ ట్రాగా పే చెయ్యాల్సి వచ్చిందని నాగాబాబు అంటున్నారు. మొత్తానికి జెనీలియా మేటర్ వల్లనే తాను డిస్ట్రబ్ అయ్యాననీ, ముందు ముందు సినీ పరిశ్రమలో తానెదుర్కొన్న సమస్య ఇంకే ఇతర నిర్మాత ఎదుక్కోకూడాదనే సమస్యను బహిరంగంగా చెప్పానే తప్పు ఎవర్నీ కించపర్చే ఉద్దేశ్యం లేదని నాగబాబు అన్నారు.

సో నాగబాబు ఫైరింగ్ కి కారణం భాస్కర్ ఓ పక్క..భాస్కర్ ఏరికోరి 'ఆరెంజ్" సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసిన జెనీలియా అన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu