»   » కుక్క తత్వం : మొన్న ఎన్టీఆర్ ..ఇప్పుడు జెనీలియా

కుక్క తత్వం : మొన్న ఎన్టీఆర్ ..ఇప్పుడు జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రీసెంట్ గా పూరి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రంలో కుక్క తత్వం గురించి ఓ డైలాగు ఉంటుంది. అందులో కుక్కలకు మనుష్యులు ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలో పూరి రాసి, ఎన్టీఆర్ చేత చెప్పించి థియోటర్ లో విజిల్స్ వేయించారు. తనకు కుక్కలమీద అభిమానాన్ని అలా పూరి చాటుకున్నారు. ఇప్పుడు అదే దారిలో జెనీలియా ప్రయాణిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జెనీలియా...కు పెంపుడు జంతువులు అంటే ప్రాణం. ఈ విషయమై ఆమె తన పెంపుడు కుక్కతో ఇదిగో ఇలా ఓ ఫొటో దిగి...మనకందరికీ ప్రేమ, కుక్క అవసరం..అప్పుడే జీవితం పరిపూర్ణం అంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా ఆమె కుక్క ఫ్లాష్ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ముచ్చట లెండి.

 Genelia speaks about pet Dogs

ఇక జెనీలియా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే...

జెనీలియా నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై రితీష్ దేశ్ ముఖ్ ల జంట చర్చించిన అనంతరం శనివారం రియాన్ గా నామకరణం చేశారు. తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.

'తుజే మేరీ కసమ్‌'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్‌, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఈ యేడాది ఆరంభంలో జెనీలియా గర్భం దాల్చిన విషయాన్ని దంపతులిద్దరూ వెల్లడించారు. జెనీలియా బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయాన్ని తెలుసుకొన్న పలువురు సినీ తారలు జెన్నీ, రితేశ్‌ దంపతులకు అభినందనలు తెలిపారు.

English summary
Genelia Deshmukh tweeted: "All you need is love and a dog,, Then life is complete"...Happy Birthday Flash .. Your my reason to smile
Please Wait while comments are loading...