»   » సిగరెట్‌, మందులాంటి అలవాట్లు...జెనీలియా

సిగరెట్‌, మందులాంటి అలవాట్లు...జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిగరెట్‌, మందులాంటివి చాలావరకు స్నేహితుల నుంచే అలవాటవుతాయి. వాళ్లు అడిగారని మొహమాటం కొద్దీ వాటికి దగ్గర కాకూడదు అంటోంది జెనీలియా. ఆమె తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే తనకు రకరకాల స్నేహితులున్నారని, అయితే ఎవరితో ఎంతవరకూ ఎలా లిమిట్ లో ఉండాలనే విషయంలో తనకు లిమిట్స్ ఉన్నాయని ఆమె చెప్తోంది. కొందరు స్నేహం పేరు చెప్పి పర్శనల్ విషయాల్లో తలదూర్చాలని ట్రై చేస్తారని వారిని ఎలా కంట్రోల్ చేయాలన్నది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందని లెక్చర్స్ ఇస్తోంది. అయితే ఎందుకిలా అతిగా స్నేహితుల గురించి స్పందిస్తోందన్న విషయం మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. ప్రస్తుతం జెనీలియా..రామ్ చరణ్ సరసన ఆరెంజ్ లో చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తన పాత్ర బొమ్మరిల్లు లో హాసినిలా పేరు తెచ్చి పెడుతుందని ఆశిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu