»   » క్యూట్ ఫ్యామిలీ : బాబుతో,భర్తతో జెనీలియా ఇలా... (ఫొటో)

క్యూట్ ఫ్యామిలీ : బాబుతో,భర్తతో జెనీలియా ఇలా... (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బొమ్మరిల్లు, రెడీ, నా ఇష్టం వంటి చిత్రాల ద్వారా పాపులరైన హీరోయిన్ జెనీలియా. ఆమె 2014 నవంబర్ లో ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మొగడు, పెళ్లాం ఇప్పుడు ఆ బాబు ఆలనా,పాలనాలో మునిగితేలుతున్నారు. బాబు తోడే అన్నట్లుగా ఎప్పుడూ కనపడుతున్నారు. ఈ విషయాన్ని జెనీలియా భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ట్విట్టర్‌ ద్వారా ఇలా ఫొటో పెట్టి వెల్లడించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక 'తుజే మేరీ కసమ్‌'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్‌, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. 2014 ఆరంభంలో జెనీలియా గర్భం దాల్చిన విషయాన్ని దంపతులిద్దరూ వెల్లడించారు. జెనీలియా బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయాన్ని తెలుసుకొన్న పలువురు సినీ తారలు జెన్నీ, రితేశ్‌ దంపతులకు అప్పట్లో అభినందనలు తెలిపారు.

బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమని ప్రకటించింది. జెనీలియా ఎక్కువ పాపులర్ అయింది సౌత్ లోనే. ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు కలిసి రాలేదు. మరి ఆమె రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? అనేది తెలియాల్సి ఉంది.

genelia with husband and Baby boy

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెను బాలీవుడ్లో హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు మాత్రం లేదు. ఒక బిడ్డకు తల్లి కాబట్టి ఇంటికి దూరంగా ఉంటూ సౌత్ లో కూడా దాదాపుగా నటించే అవకాశం లేదు. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ నిర్మించే సినిమాల్లో ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఇతర బేనర్లలో కూడా నటించేందుకు సిద్ధంగా ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Ritesh deshmukh tweeted "Riaan completes Us geneliad"
Please Wait while comments are loading...