»   » వేటగాడు ని మేం కాపీ చేయలేదు: కాపీ ఆరోపణల మీద స్పందించిన నాని

వేటగాడు ని మేం కాపీ చేయలేదు: కాపీ ఆరోపణల మీద స్పందించిన నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్నమైన చిత్రాలను .. విలక్షణమైన పాత్రలను చేయడంలో మొదటి నుంచి నాని ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. కొత్తదనం కోసం ఆయన చేస్తోన్న ప్రయత్నాలే వరుస విజయాలను తెచ్చిపెడుతున్నాయి. అలా హ్యాట్రిక్ హిట్ కొట్టిన నాని, మరో రెండు రోజుల్లో 'జెంటిల్ మన్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సంధర్బం లోనే సినిమా మీద ఉన్న కొన్ని అపోహలను తొలగించాలనుకున్నాడు నాని. అందుకే తన సినిమా "జెంటిల్ మేన్" బాలీవుడ్ బాజీగర్ (తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన "వేటగాడు" సినిమా) కి అనుకరణ కాదనీ... అలాంటి వార్తలని పట్టించు కోవద్దనీ చెప్పాడు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటినుంచే ఈ అనుమానం చాలా మందికి వచ్చింది. అందుకే ఇప్పుడైనా "నష్ట నివారణా చర్యలు " తీసుకోకుంటే క్లాభం లేదనుకున్నాడెమో... ఇలా క్లారిటీ ఇచ్చాడు


జెంటిల్‌మన్ స్టిల్స్ ఫోటో గ్యాలరీ


Gentleman is not Copy of Baazigar: Nani

ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే మనకు నాని నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో నటించాడు అనిపిస్తోంది. కాగా ఈ ట్రైలర్ లో కొన్ని సీన్స్ చూసిన వాళ్ళకు బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమా బాజీగర్ ను గుర్తుకు తెస్తోంది. ఈ సినిమాతో షారూఖ్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.


కాగా జెంటిల్ మేన్ సినిమా ట్రైలర్ లో చాలా వరకూ నాని పాత్ర బాజీగర్ లో షారూఖ్ పాత్రను పోలి ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఒక హీరోయిన్ ను హీరో చంపేసి.. మరో హీరోయిన్ వెంట ప్రేమ అంటూ వెంటపడడం.. అవసరాల శ్రీనివాస్ పాత్ర నడవడి తీరు.. ఇవన్నీ ట్రైలర్ లో చూపించిన విధానం బాజీగర్ ను గుర్తుకు తెస్తున్నాయి.


Gentleman is not Copy of Baazigar: Nani

ఈ సినిమాపై 'బాజీగర్' ప్రభావం ఉందనే ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదనీ., దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడనీ, కొత్తదనాన్ని కోరుకునే యూత్ కి ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. వినోదం పరంగా థియేటర్ కి వచ్చి ప్రేక్షకులకు ఎంతమాత్రం నిరాశ కలగదంటూ... ఈ సినిమాతో తనకి మరో హిట్ దొరకడం ఖాయమనే నమ్మకం వుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. భలే భలే మగాడివోయ్ , కృష్ణగాడివీర ప్రేమగాధ తర్వాత వస్తోన్న ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

English summary
Hero Nani says his new movie gentleman which is Directed by Mohanakrishna Indraganti is not a copy or sequel of Bollywood "Baazigar"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu