Just In
- 4 min ago
మరో సినిమా కోసం అడ్వాన్స్ అందుకున్న వైష్ణవ్ తేజ్..?
- 30 min ago
ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత
- 1 hr ago
నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్
- 1 hr ago
RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!
Don't Miss!
- Sports
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక మారింది.. ఎక్కడంటే..?
- News
కమల్ హాసన్ థర్డ్ ఫ్రంట్ రెడీ... సీట్ల లెక్కలు కొలిక్కి... ఎవరెన్ని చోట్ల పోటీ చేస్తున్నారంటే...
- Finance
వచ్చే ఆర్థిక సంవత్సరం బ్యాంకుల పరిస్థితి దిగజారొచ్చు, కారణమిదే
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జార్జ్‌రెడ్డి ట్విట్టర్ రివ్యూ: రియల్ హీరో లైఫ్ తెర మీద ఎలా ఉందంటే..
70, 80 దశకాల మధ్య వామపక్ష భావజాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించిన విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా జార్జ్‌రెడ్డి తెరకెక్కింది. దళం ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు. సందీప్ మాధవ్ జార్జరెడ్డి పాత్రను పోషించారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మీడియాకు 21వ తేదీ ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన నెటిజన్ల అభిప్రాయాలు మీ కోసం..

పవన్ కల్యాణ్ ఎందుకు చేయలేదో
జార్జిరెడ్డి లాంటి మాస్టర్ పీస్‌ను పవన్ కల్యాణ్ ఎందుకు చేయలేదో. విప్లవ భావాలు, అద్భుతమైన సినిమాటోగ్రఫి, రీరికార్డింగ్‌తో కూడిన ప్యాకేజ్ అద్భుతంగా ఉంది.

వాస్తవ కథను తెరకెక్కించడంలో
జార్జిరెడ్డి కథలో జార్జ్, ఆరెస్సెస్ మధ్య ఉన్న గొడవలే ప్రధానమైనవి. వాస్తవమైన ఇష్యూను చూపించడంలో ఫెయిల్ అయ్యారు. జార్జిరెడ్డి జీనియస్. అందులో ఎలాంటి సందేహం లేదు. బ్లేడ్‌లు పట్టుకొని కోస్తాడనేది చూపిస్తారా? అందులో కూడా క్లారిటీ లేదు.

ఆ రోజు తుపాకీ పట్టి ఉంటే
ఆ రోజు జార్జ్ తుపాకీ పట్టి ఉంటే చరిత్ర ఇంకోలా ఉండేది. క్లైమాక్స్ చూసిన తర్వాత భారమైన మనసులో థియేటర్ నుంచి వచ్చాను.

హిస్టరీని మరోసారి
జార్జిరెడ్డి అద్భుతంగా ఉంది. హిస్టరీ తెలియజేసిన దర్శకుడు జీవన్ రెడ్డికి థ్యాంక్స్.

ఆసక్తిని రేకెత్తించిన సినిమా
టాలీవుడ్‌లో ఓ సినిమాను చూడాలనిపించేలా ఆసక్తిని రేకెత్తించిన సినిమా జార్జ్‌రెడ్డి. స్టోరి బాగుంది. యూనివర్సిటీ సీన్స్ కేక పెట్టించాయి. డైలాగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. రీరికార్డింగ్ బాగుంది. సందీప్ మాధవ్ యాక్టింగ్ ఎక్సలెంట్. జీవన్ రెడ్డి అద్భుతమైన సినిమాను తీశాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతాయి. సూపర్.

కథ, కథనాలు బలహీనంగా
ఓ కల్ట్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు జార్జ్‌రెడ్డికి ఉన్నాయి. కానీ కథ, కథనాలు బలహీనంగా కనిపిస్తాయి. తెరకెక్కించిన విధానంగా బాగాలేదు. రియల్ హీరోకు నివాళి అర్పించాల్సినంత రేంజ్ సినిమాలో లేదు. సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ ఉంటే ఈ కథకు పూర్తి న్యాయం జరిగేదేమో అనిపించింది. నేను కొంత నిరాశపడ్డాను.

న్యాయం జరుగలేదు
జార్జ్‌రెడ్డి బాగుంది. కొన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి. కానీ కథలో ఆత్మ లోపించింది. జార్జ్‌రెడ్డి ఐడియాలజీని చూపించడంలో దర్శకుడు న్యాయం చేయలేకపోయారు. హీరోయిజం చూపించడంపైనే దృష్టిపెట్టారు.

ఆ సీన్లు బాగున్నాయి
దళం సినిమాలో ఫారెస్ట్‌లో ఎన్‌కౌంటర్ సీన్లు ఎలా హైలెట్ అయ్యాయో.. ఆ రేంజ్‌లో జార్జ్‌రెడ్డిలో రెండు సీన్లు బాగా పండాయి. ఫైర్ బాల్, బ్లేడ్ ఫైట్ సీన్లు తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు.

క్లారిటీ లోపించింది
జీవన్ రెడ్డి డైరెక్షన్ బాగుంది. అతని మరణం తర్వాత జరిగిన సంఘటనలు వదిలేయడం బాగాలేదు. ఆయన బాంబే యూనివర్సిటీకి ఎందుకు వెళ్లలేదో అనే విషయంలో క్లారిటీ లోపించింది. అలాంటి సీన్లు షూట్ చేసి ఉంటే రిలీజ్ చేయండి. డైలాగ్స్ బాగున్నాయి.