»   » కరణ్ జోహార్ ఆత్మకథ వస్తోంది: షారుక్‌తో తనకి సెక్సువల్‌ రిలేషన్‌ వుందనే పుకార్లపై...

కరణ్ జోహార్ ఆత్మకథ వస్తోంది: షారుక్‌తో తనకి సెక్సువల్‌ రిలేషన్‌ వుందనే పుకార్లపై...

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత్‌లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నదనడం పెద్ద జోక్‌ అని బాలీవుడ్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహర్‌ అన్న విషయం గుర్తుందా? జైపూర్‌లో ఓ సాహిత్య సదస్సు సందర్భంగా ఆయన తన మనసులోని మాటలు బయటపెట్టారు. 'ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఎక్కడ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది? ఎక్కడికి వెళ్లినా నాకు భయంగా ఉంది.

ఏం మాట్లాడాలన్నా నా మీద ఎక్కడ కేసులు బుక్కవుతాయోనని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నా' అంటూ చెప్పారు. అంతేకాదు, స్వలింగ సంపర్కం నేరమని ప్రాచీన చట్టాలు చూపుతున్నాయని చెప్పారు. తాను గే కాదని, ఇప్పటివరకు ఎక్కడా వెల్లడించలేదని కరణ్‌ అభిమానులకు గుర్తు చేశారు. ఒకవేళ వ్యక్తిగత జీవితాన్ని వెల్లడిస్తే ఎక్కడ జైలుకు వెళ్తామోనని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికే కరణ్ ఒక స్వలింగ సంపర్కి అనే విషయం చాలామందికి తెలుసు. అయితే బహిరంగంగా ఎక్కడా దానిని బయటపెట్తలేదు.

ఇండియాలోనే టాప్ మోస్ట్ డిరెక్తర్లలో ఒకడైన కరణ్ నిర్వహించే షో కాఫీ విత్ కరణ్ లో కూడా కరణ్ ఎక్కువగా వేసే ప్రశ్నలు తారల లైంగిక సంబందాలూ, లైంగికావయవాల పనే ఉంటాయి. అలాంటిది ఇక కరణ్ ఏకంగా ఒక పుస్తకం రాస్తే.... తన జీవితం లో ఉన్న "ఆ"సంబందాలని గురించి కూడ చెప్పబోతున్నాడట.

Get ready to read the autobiography of Karan Johar

అతడిని మొహం మీదే గే అన్నవాళ్లున్నారు. అలాంటి కామెంట్స్‌ని నవ్వుతూ స్వీకరించే కరణ్‌ తన సెక్సువల్‌ ప్రిఫరెన్స్‌ చెప్పడం ఈ దేశంలో నేరమని, తనని జైల్లో కూడా పెట్టవచ్చునని అన్నాడు. తను ఒక హోమో సెక్సువల్‌ అనే సంగతి అతను ఈ మాటలతో చెప్పకనే చెప్పేసాడు. ఇదిలావుంటే కరణ్‌కి తొలి సెక్స్‌ అనుభవం ఇరవై ఆరేళ్ల వరకు కాలేదట.

అసలు తనకి ఆ ఆలోచనే వుండేది కాదని, లావుగా వుండడం వల్ల ఆత్మన్యూనతా భావంతో అలా వుండేవాడినేమో తెలీదని రాసాడు. అయితే తన తొలి సెక్స్‌ అనుభవం ఆపోజిట్‌ జెండర్‌తోనా లేక తనకి నచ్చినట్టుగా జరిగిందా అనేది మాత్రం అతను వివరణ ఇవ్వలేదు.

అలాగే షారుక్‌తో తనకి సెక్సువల్‌ రిలేషన్‌ వుందనే పుకార్లపై ఘాటుగా స్పందించాడు. సోదరుడితో ఎవరైనా అలా చేస్తారా అని ప్రశ్నించాడు. కరణ్‌ పుస్తకం రిలీజ్‌ అయితే ఇంకా అందులో ఎన్ని సంచలన సంగతులుంటాయో చూడాల్సిందే.

English summary
Karan Johar is surely one of the most interesting celebs of Bollywood. And a book on him would be really something to look forward to. Well, we are talking about the book on Karan because his autobiography is going to be out very soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu