»   » బిందాస్ నచ్చలేదా? టికెట్ డబ్బు వాపసట

బిందాస్ నచ్చలేదా? టికెట్ డబ్బు వాపసట

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశాల్లో బిందాస్ సినిమా ప్రమోషన్ జరుగుతోంది. ఎంతో ఖర్చు పెట్టుకుని సినిమా చూసిన తర్వాత నచ్చకపోతే ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు టికెట్ డబ్బు వాపస్ చేస్తారట. ఈ సినిమాకు దర్శకుడు వీరు పొట్ల. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకు పొట్ల కథలను సమకూర్చారు. ఇది పూర్తి స్ధాయి హాస్య చిత్రం. ప్రధాన హాస్యనటులంతా ఉన్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ సొంతంగా ఫైట్లు చేశాడట.

మనోజ్ సరసన కొత్త హీరోయిన్ షీనా నటిస్తోంది. ఇంకా బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, ఎంఎస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu