»   » పాపం నాగార్జున కూడా సంజాయిషీ ఇచ్చాడు... చలపతి చలవే

పాపం నాగార్జున కూడా సంజాయిషీ ఇచ్చాడు... చలపతి చలవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఆది వారం రోజు రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుక లో "అమ్మాయిలు పక్కలోకి పనికి వస్తారు" అంటూ మాట్లాడిన మాటలమీద పెద్ద దుమారమే చెలరేగింది. మహిళా సంగాలన్నీ కలిసి జూబ్లి హిల్స్ చేరుకున్న మహిళల గౌరవానికి భంగకరంగా, వెకిలిగా మాట్లాడిన ఆయనపై మహిళా సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

 కొండవీటి సత‍్యవతి

కొండవీటి సత‍్యవతి

ఈ మేరకు నటుడు చలపతిపై జూబ్లీ హిల్స్‌ పోలిస్‌ స్టేషన​ లో ఫిర్యాదు చేశాయి. భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత‍్యవతి, సామాజిక కార్యకర్త దేవి తదితరులు పోలీసులకు తమ ఫిర్యాదును అందించారు. మహిళలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రమదాక్షరీ ఉమెన్ రైటర్స్ ఫేస్ బుక్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 మరో వైపు యాంకర్‌ రవి

మరో వైపు యాంకర్‌ రవి

మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరో వైపు యాంకర్‌ రవి, వివిధ టీవీషోలలో అతని వల్గర్‌ కమెంట్లపై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.ఈ ఉదయ్యాన్నే పదకొండు గంటలకల్లా అక్కడికి చేరుకున్న మహిళా సంఘాల నేతలు చలపతి వ్యాఖ్యలమీద లిఖిత పూర్వక ఫిర్యాదు చేసారు.

చలపతి రావు జైల్లో కి వెళ్ళేదాకా

చలపతి రావు జైల్లో కి వెళ్ళేదాకా

ఈ తరహా దోరణి సినిమాల్లో పెరిగి పోయిందనీ, గతం లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో మాట్లాడిన సమయం లో వదిలేయటం జరిగింది కానీ ఈసారి చలపతి రావు జైల్లో కి వెళ్ళేదాకా తమ ఆందోళన ఆగేది లేదంటూ కొండవీటి సత‍్యవతి చెప్పారు. చలపతి రావు ఒక్కడే కాదు అక్కడ ఉన్న అంతమందీ అసలు ఆ మాట విని కూడా పడీ పడీ నవ్వు కోవటం చూస్తూంటే సలు మనం ఎక్కడ ఉన్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

అక్కినేని నాగార్జున స్పందించారు

అక్కినేని నాగార్జున స్పందించారు

ఈ వివాదం మరింత తీవ్రంగా మారుతూండటం తో రారండోయ్‌ వేడుక చూద్దాం నిర్మాత, హీరో అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. అమ్మాయిలపై చలపతి వల్గర్‌ కమెంట్లపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. మొన్న జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ఆదియో ఫంక్షన్ లో చలపతి రావు చేసిన అగౌరవ వ్యాఖ్యల్ని ఖండించారు. తన వ్యక్తిగత జీవితంలోనూ, తన సినిమాల్లోనూ మహిళలపట్ల గౌరవం ఉందంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు.

అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం

అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం

ఇక చలపతి రావు మాటలని పక్కకు పెడితే ఈ గొడవంతటికీ కారణమైన మాట "అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం" అన్న మాటలపైన కూడా ప్రధానంగా పలువురు మేధావులు, ప్రముఖ రచయిత్రులు, మహిళా సంఘాల నేతలు, ఇతర పెద్దలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

చలపతి రావు నోటి చలవ

చలపతి రావు నోటి చలవ

మరి ఈ అభ్యంతరాలపై నాగ్‌ లేదా.. ఈ చిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్న యువ హీరో, నాగార్జున కుమారుడు నాగ చైతన్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. చలపతి రావు నోటి చలవ వల్ల ఆఖరి కి నాగార్జున కూడా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తానికి చలపతి రావుని ఇక మీదట పబ్లిక్ ఫంక్షన్లలో ఎవరూ కదిలించే సాహసం చేయరేమో.

English summary
"I always respect women personally and in my films/I definitely do not agree wt Chalapati rao's derogatory comments/dinosaurs do not exist!!" Tweeted Nagarjuna
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu