For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పాపం నిత్యామీనన్ ఇంకోసారి బకరా అయ్యింది: ఆ ఘటన నిర్మాతల తప్పేనా..??

  |

  దృశ్యం వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో చిత్రం ఘటన. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె. సత్తార్ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన 22 ఫిమేల్ కొట్టాయం చిత్రాన్ని సన్‌మూన్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్. కృష్ణ ఎం. ఘటన పేరుతో రీమేక్ చేసారు. మ‌ల‌యాళ చిత్రం 22 ఫిమేల్ కొట్టాయం మ‌ల‌యాళ సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది..క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చి ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది.

  ప్ర‌స్తుతం ఉన్న హీరోయిన్స్‌లో మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం. స్త్రీల పై జరిగే అకృత్యాలని ఆపాలేమా అన్న ఆలోచనే ఈ సినిమా కి బేస్... అయితే నిన్ననే నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడ" తో పాతుగానే ఈ సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది... కానీ ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు... నిజానికి ఇక్కడ ప్రేక్షకుడి తప్పు లేనేలేదు... అసలు ప్రచారమే చేయకుండా.., సినిమా వస్తూంది అన్న విషయమే అర్థం కాకుండా గప్ చుప్ గా థియేటర్లలోకి తోస్తే ఎవరికి తెలుస్తుంది??? నిజానికి బాలీవుడ్ లో వచ్చిన "పింక్" రేంజ్ లో సంచలనం అవ్వాల్సిన ఈ సినిమా నిర్మాతల నిర్లక్ష్యం తో అట్టర్ ఫ్లాప్ అనిపించుకునేలా ఉంది...

  'దృశ్యం' సినిమాతో దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీప్రియ మరోసారి చేసిన ప్రయత్నమే 'ఘటన'. మలయాళంలో ఆశిక్‌ అబు దర్శకత్వం వహించిన '22 ఫిమేల్‌ కొట్టాయం' సినిమా 2012లో విడుదలై కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు దక్కించుకుంది. అందులో నటించిన రిమా కలింగాల్‌కు ఉత్తమ నటి అవార్డు రాగా, ప్రతాప్‌ పోతన్‌, ఫాజిల్‌ పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రాన్ని 2014లో 'మాలిని 22 పాలయమ్‌ కొటై' పేరుతో తమిళంలో శ్రీప్రియ రీమేక్‌ చేశారు. నిత్యమీనన్‌, క్రిస్‌ జె. సత్తార్‌, సీనియర్‌ నరేష్‌ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెలుగులో 'ఘటన'గా విడుదలైంది. రాధాకృష్ణ నిర్మాతకాగా, శివకుమార్‌ విడుదలకు సహకరించారు.

  Ghatana telugu movie flop talk

  నిత్యా మీనన్ తన భుజాల మీద వేసుకుని చేసిన సినిమా ఈ ఘటన. మాలిని పాత్రలో అద్భుతంగా నటించింది నిత్యా. నిత్యా మీనన్ ఇదవరకు చేసిన సినిమాల్లో కన్నా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపిస్తుంది. సినిమా మొత్తం ఆమె మీద నడుస్తుండటంతో కీ రోల్ గా నిత్య అదరగొట్టింది. ఇక వరుణ్ గా నటించిన క్రిష్ కూడా పర్వాలేదు అనిపించాడు. ఇక ప్రకాశ్ లాంటి కామాంధుడి పాత్రలో సీనియర్ యాక్టర్ నరేష్ అదరగొట్టాడు. నరేష్ ను ఇలా విలన్ గా చూపించాలని ఆలోచన రావడం గొప్ప విషయం అయితే ఆ పాత్రకు నరేష్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం విశేషం. సాధారణంగా ఇన్నోసెంట్ గా ఉండే నరేష్ విలన్ రోల్ కాస్త వెరైటీగా అనిపించింది. ఇక కోవై సరళ కాసేపు నవ్వులు పంచగా.. కోటా శ్రీనివాస్ రావు ఓ మంచి పాత్రలో నటించి మెప్పించారు.

  ఒక వైపు దేశంలో పెద్ద నోట్ల చెలామణి రద్దుతొ జనాలు నానా తంటాలు పడుతున్నారు, డబ్బు టెన్షన్ తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేస్తున్న అనుకున్న పెట్టుబడి రాక ఆయోమయ స్థితిలో పడుతున్న నిర్మాతలు. శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన '' ఘటన '' నిన్ని రిలీజ్ అయ్యింది. నిత్యా మీనన్ అద్భుతంగా నటించినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయినట్లు కూడా తెలియకపోవడంతో జనాలు లేరు .

  English summary
  Short report about Nityamenon's Latest movie Ghatana., The film came with aninteresting plot. “Ghatana” is a must watch film for its interesting concept but ther is no proper pramotion for this Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X