యువతిపై లైంగిక వేధింపులు.. గజల్ శ్రీనివాస్ అరెస్ట్.. బిడ్డలా చూసుకొన్నాను..
Recommended Video

లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు చర్యలు తీసుకొన్నట్టు సమాచారం. ఆలయవాణి అనే వెబ్ రేడియో చానెల్‌ను గజల్ శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. గజల్ శ్రీనివాస్ అరెస్ట్ వార్త మీడియాలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు
మీడియా కథనాల ప్రకారం.. ఆలయ ఆఫీస్‌లో కుమారి అనే మహిళ రేడియో జాకీగా, ప్రొగ్రాంహెడ్‌గా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా తనను వేధిస్తున్నట్టు కుమారి డిసెంబర్ 29న ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.

అనేక రికార్డులు,అవార్డులు
గాంధేయవాదంపై పలు భాషల్లో గజల్స్ పాడిన ఘనత గజల్ శ్రీనివాస్‌కు ఉంది. మూడు గిన్నిస్ బుక్ రికార్డులు, ఓ లిమ్కా బుక్ రికార్డు, పలు పురస్కారాలను ఆయన అందుకొన్నారు.

స్వచ్ఛ అంబాసిడర్‌గా
కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. నల్గొండ ఫ్లోరిసిస్ బాధిత గ్రామాలను దత్తత తీసుకొన్నారు.
ఎన్నో సేవా కార్యక్రమాలు
అంతే కాకుండా గజల్ శ్రీనివాస్ ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ హాస్పిటల్‌కు కల్చరల్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

షాక్‌కు గురిచేసిన గజల్ అరెస్ట్
అలాంటి ప్రముఖుడైన గజల్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడం సన్నిహితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లైంగిక ఆరోపణలకు సంబంధించిన టెలిఫోన్ సంభాషణలు, వీడియో ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఉద్దేశపూర్వకంగా మహిళ ఫిర్యాదు చేసిందా లేక గజల్ శ్రీనివాస్ వేధింపులు నిజమేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నా బిడ్డలా చూసుకొన్నాను..
పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గజల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ‘నేను నా ఆత్మసాక్షిగా చెబుతున్నా. మహిళలను గౌరవిస్తాను. నాపై ఫిర్యాదు చేసిన అమ్మాయిని నా బిడ్డలా చూశాను. నా మాటలను నమ్మండి. అమ్మాయిని వేధించాను అనే మాట అవాస్తవం. ఆలయ వాణి వెబ్ రేడియో ఆఫీసు నుంచి వీడియోలు తీసుకుపోయిందని కొందరు చెప్పారు. ఆ వీడియోల్లో ఏముందో కూడా తెలియదు. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించ లేదు' అని గజల్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











