»   » హైపర్ తో తేలిపోయింది.... ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే ఇక ఫ్యూచర్ కష్టమే

హైపర్ తో తేలిపోయింది.... ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే ఇక ఫ్యూచర్ కష్టమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు టాలీవుడ్ కి మూడు కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. మొదటిది హీరోయిన్ లు. ఇప్పుడున్న కుర్ర హీరోలకూ, అటు పెద్ద హీరోలకూ కలిపి ఉన్న హీరోయిన్లే అటు స్టార్ హీరోలతోనూ ఇటు కుర్ర హీరోలతోనూ చేసేస్తున్నారు. అయితే ఒకసారి యంగ్ హీరోలతో చేసాక వయసులో పెద్దవాళ్లైన సీనియర్ హీరోలతో చేయటానికి జంకుతున్నారు హీరోయిన్లు ఈ సంగతి పక్కన పెడితే రెండో సమస్య విలన్లు ఇప్పటికీ మనం ఏ బాలీవుడ్ నుంచో కన్నడ నుంచో విలన్ లని అరువు తెచ్చుకుంటున్నాం తప్ప మనకంటూ స్తాండర్డ్ నటులు లేరు..,

ఇక అన్నిటికంటే ముఖ్యమైంది మ్యూజిక్ డైరెక్తర్లు... టాలీవుద్ లో సంవత్సరానికి వచ్చే సినిమాల్లో మరీ చిన్న సినిమాలని వదిలేస్తే ఒక మోస్తరు బడ్జెట్ ఉన్న అన్ని సినిమాలకూ దేవిశ్రీ ప్రసాద్..తమన్.. అడపా దడపా అనూప్ రూబెన్స్ మాతమే కనిపిస్తున్నారు... మణిశర్మ లాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కూదా వెనికబడ్డాడు. అయితే ఇలాంటి పోటీ కాలం లో కూడా 'రన్ రాజా రన్' తో ఒక్కసారి ముందుకు దూసుకు వచ్చాడు యువ మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ అయితే ఆ సక్సెస్ మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల్లో అతడి మ్యూజిక్ విని అతడి మీద మరింతగా అంచనాలు పెంచుకున్నారు. తెలుగు లో కూడా వరుస ఆఫర్లు చుట్తు ముట్టాయి.


కానీ ఏమైందో తెలియదు ఒక్క సారిగా జీబ్రాన్ బీట్ లో జోష్ తగ్గిపోయింది విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం 'బాబు బంగారం' లా వచ్చింది. మరీ స్టార్ కాకున్నా ఒక స్థాయి ఉన్న హీరో అయిన యంగ్ హీరో రామ్ తో'హైపర్' లాంటి ఎనర్జిటిక్ సినిమా చేసే అవకాశం వెంట వెంత నే దక్కాయి. ఐతే ఈ అవకాశాల్ని జిబ్రాన్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. తన మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లు మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు.


Gibraan It's Time To Prove once Again if not...!?

'బాబు బంగారం' పాటలు యావరేజ్ కన్నా ఘోరంగా పేలవం అనిపించాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుమంటే అంత మంచిఒది. అది గమనించే 'హైపర్'కు ఆర్ఆర్ అతడితో చేయించలేదు. పాటలకు మాత్రమే ఛాన్సిచ్చారు. ఐతే అతను పూర్తిగా నిరాశ పరిచాడు. మామూలుగా జనం లో పాపులర్ కావాల్సిన మాస్ సినిమాకి ఉండాల్సిన హైప్ ఈ మ్యూజిక్ రాలేదు.


ఏదో అలా తూ తూ మంత్రంగా పనికానిచ్చేసాడు అన్నట్టు గా ఉన్నాయి పాటలన్నీ, ఇంతకీ అసలు జీబ్రాన్ ఎందుకులా అయిపోయాడన్నదే ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక జీబ్రాన్ లో "స్టఫ్" అయిపోయినట్టే నా అనేదే అనుమానం. తెలుగులో తొలి సినిమాతోనే ఒక రేంజ్ కి వెళ్ళిన జిబ్రాన్.. అంతే త్వరగా తన పేరు చెడగొట్టుకున్నాడు. ఇదే గనక ఇంకో రెండు కేసుల్లో కంటిన్యూ అయితే జీబ్రాన్ కూడా ఇక ఇంటి బాట పట్టడం ఖ్య్యమే మరి. చూడాలి ఇప్పటికైనా తేరుకుంటాడో లేదో...

English summary
After Babu bangaram and Hyper music Disasters Music Director Ghibran has to be Prove once Again him self
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu