»   » హేమా మాలినిపై...కుమార్తెను పోగొట్టుకున్న తండ్రి మండిపాటు

హేమా మాలినిపై...కుమార్తెను పోగొట్టుకున్న తండ్రి మండిపాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూ ఢిల్లీ: ఇటీవల రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి, భాజపా ఎంపీ హేమమాలిని గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ... ఓ చిన్నారి మృతి చెందిది. హాస్పటిల్ నుంచి డిఛ్చార్జ్ అయిన హేమమాలిని ఈ విషయమై చాలా మానసిక వేదన అనుభవించారు.

ప్రమాద ఘటనపై హేమమాలిని ట్విట్టర్‌లో ప్రస్తావిస్తూ... చిన్నారి తండ్రి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం తప్పేదని, పాప బతికుండేదని పేర్కొన్నారు. ప్రమాదంలో పాప చనిపోవడం తనను కలచివేసిందన్నారు.

Girl's father slams Hema Malini

అయితే తాను ట్రాఫిక్‌ నియమాలు పాటించలేదని హేమమాలిని చేసిన ఆరోపణలను ప్రమాద సమయంలో ఆల్టో కారు నడుపుతున్న హనుమాన్‌కుమార్‌ తోసిపుచ్చారు. దౌసా వద్ద తన కుమార్తెను బలిగొన్న ఆ ప్రమాదం జరగడానికి ముందు తాను ఇండికేటర్‌ వేశానని, తన ముందు మరో వాహనం కూడా ఉందని ఆయన చెప్పారు. నిముషంన్నర వేచి చూశాక రోడ్డు ఖాళీగా కనిపించిన తర్వాతే తాను బయలుదేరానని వివరించారు.

ఏ ట్రాఫిక్‌ నియమాన్ని ఉల్లంఘించానో చెప్పాలని హనుమాన్‌ ప్రశ్నించారు. ప్రమాదంలో తన కూతురు చనిపోయిన సంగతి తెలిసి కూడా హేమమాలిని ఇంతవరకు ఫోన్‌లో కూడా పరామర్శించలేదని ఆయన గుర్తు చేశారు.

English summary
"My fault? There is no other way to go on that road.I even switched on indicators. She is a big name but must atleast think before speaking," father of girl who died in Dausa accident told ANI.
Please Wait while comments are loading...