»   » గోవా వ్యభిచార కూపం నుంచి తెలుగు నటికి విముక్తి

గోవా వ్యభిచార కూపం నుంచి తెలుగు నటికి విముక్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు,తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ తెలుగు నటి ప్రస్తుతం గోవా వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. ఆమెను గోవా పోలీసులు కాపాడారు. పణిజి ఇన్సెపెక్టర్ సిద్దాంత్ శిరోద్కర్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. సినిమా వేషాలు తగ్గిన ఆమెను సహాకురాలు ఆయేషా సయ్యిద్ ఈ వ్యభిచార కూపంలోకి దింపిందని అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Goa police rescue Telugu actress from prostitution racket


ఇన్సెపెక్టర్ చెప్పిన వివరాలు ప్రకారం...నటి, ఆమె సహాకురాలు కలిసి మంగళవారం ఉదయం పణజికు చేరుకుని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ తీసుకున్నారు. రాత్రి అయిన తర్వాత ఆ గదికి ఓ పెద్ద మనిషి చేరుకున్నాడు. ఈ లోగా అక్కడ పోలీసులకు సమాచారం వెళ్లింది. దాంతో వారు హోటల్ పై దాడి చేసారు. విటుడు పోలీసులు కన్ను గప్పి పారిపోగా, నటిని, ఆమె సహాయకురాలిని అదుపులోకి తీసుకున్నారు.

నిస్సహాయ స్దితిలో ఉన్న తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపేందుకు ఆయేషా ప్రయత్నిస్తోందని నటీమణి పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. ఆయేషా పై కేసు నమోదు చేసారు. విటుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గతంలో...

గోవాలోని ఓ హోటల్లో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోతున్న ఓ బాలికను పోలీసులు రక్షించారు. ఒడిషాకు చెందిన ఈ 16 ఏళ్ల బాలికను బలవంతంగా లాక్కొచ్చి వ్యభిచారంలోకి దించారని, ఆమెను కాపాడి ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆమెను ఒడిషా నుంచి అపహరించి గోవాలో అమ్మేసినట్లు తెలిసిందని ఇన్ స్పెక్టర్ పరేష్ నాయక్ చెప్పారు.

అరెస్టయిన నిందితులంతా ఒడిషాకు చెందినవారేనని ఆయన తెలిపారు. అంజునా బీచ్ గ్రామంలోని ఓ హోటల్ నుంచి బాలికను కాపాడారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో అంజునా పోలీసు బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. బాలికను వైద్యపరీక్షలకు పంపామని, ఆమె వాంగ్మూలం నమోదుచేస్తున్నామని, నిందితులందరిపైనా మనుషుల అక్రమ రవాణా కేసు పెట్టామని ఇన్ స్పెక్టర్ వివరించారు.

English summary
A small time film actress, who has acted in some Bollywood and Telugu films, was rescued from a prostitution racket and her pimp arrested in a raid at a five-star hotel in Goa .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu