»   » నటిపై అత్యాచారం కేసు...అసలు జరిగింది ఇదీ

నటిపై అత్యాచారం కేసు...అసలు జరిగింది ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Godman cons, rapes Indian TV actress
ముంబయి : బుల్లితెర నటిపై అత్యాచారం చేసి ఆమె ఇంటి నుంచి రూ.26 లక్షల నగదు దోచుకుపోయిన మాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో బయిటకు వచ్చిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరో ప్రక్క మరొక మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు. 'మాడా' సొసైటీలో ఫ్లాటు ఇప్పిస్తామని నమ్మించి ఇలా మోసం చేశారు. చార్‌కోప్‌ నివాసి అయిన సదరు బుల్లితెర నటి 2013లో 'మాడా'లో ఫ్లాటు కోసం దరఖాస్తు చేసుకుంది.

ఆమె చేస్తున్న ప్రయత్నాలను గమనించిన మాంత్రికుడు భగవాన్‌దాస్‌ ఆమెకు మాయమాటలు చెప్పాడు. దరిద్రం పట్టి పీడిస్తోందని నమ్మించాడు. అందుకోసం భారీ యజ్ఞం చేయాలని చెప్పి రూ.50 వేలు తీసుకున్నాడు. ఫలితం కనిపించకపోవడంతో మాహింకు చెందిన మరో పెద్ద మాంత్రికుడు ఇస్మాయిల్‌ వద్దకు వెళ్లాలని ఆమెకు సలహా ఇచ్చాడు. ఆయన వద్దకు వెళ్తే సమస్యలన్ని తొలగిపోతాయని, మాంత్రికుడు సాక్షాత్తు సాయిబాబా ప్రతిరూపమని ఆమెకు చెప్పాడు.

అది నమ్మిన నటి.. ఇస్మాయిల్‌ ఖాన్‌(35)ను కలుసుకుంది. ఆమె ఇంట్లో ఒక పెద్ద భూతం ఉందని, పూజలు చేయాలని ఒప్పించాడు. ఇంటికి వచ్చి పూజ పేరుతో హిప్నటైజ్‌ చేసి ఆమెను లోబరుచుకున్నాడు. అనంతరం ఇంట్లో దాచిన రూ.26 లక్షల నగదుతో ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 9న చార్‌కోప్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఇస్మాయిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేటికి పరారీలో ఉన్న భగవాన్‌దాస్‌ కోసం గాలిస్తున్నారు.

English summary
In what seems like a story out of a crime-based TV soap, a 27-year-old TV actress was conned and raped by a tantrik with the promise of a MHADA flat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu