»   » అవార్డుల పంక్షన్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

అవార్డుల పంక్షన్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: దర్శకత్వం వహించిన తొలి చిత్రం విశేష ప్రతిభ కనబరచిన ఉత్తమ భారతీయ చలనచిత్రానికి గత 17 సంవత్సరాలుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘గొల్లపూడి శ్రీనివాస్‌' స్మారక జాతీయ పురస్కారానికి ఈ ఏడాది 'క్యూ' హిందీ చిత్ర దర్శకుడు సంజీవ్‌ గుప్తా ఎంపికయ్యారు. చెన్నైలోని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడెమీలో ఆగస్టు 12న ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. అవార్డుతో పాటు రూ. 1.5 లక్షల నగదు అందజేసారు.

గొల్లపూడి శ్రీనివాస్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ప్రఖ్యాత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మూడో కుమారుడు 23 ఏళ్ల క్రితం విశాఖ సాగరతీరంలో 'ప్రేమ పుస్తకం' చిత్రం షూటింగ్‌ సమయంలో ప్రమాదవశాత్తూ మరణించారు. ఆయన స్మృత్యర్థం ఈ అవార్డు ఇస్తున్నారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు వసంత్‌, సుప్రసిద్ధ తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నటి రోహిణిలతో కూడిన జ్యూరీ దేశంలో ఈ ఏడాది వివిధ భాషల్లో వచ్చిన 17 ఎంట్రీలను పరిశీలించి- ఉత్తమమైనది 'క్యూ'ను ఎంపిక ఎంపిక చేసారు.

Gollapudi Srinivas Award for Q

ఈ అవార్డు కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ నుండి ఫరా ఖాన్, తమిళ నిర్మాత కార్తీక్ సుబ్బరాజు, నటి సుహాసిని హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ మధ్య కొన్ని సినిమా అవార్డుల పురస్కార ప్రధానోత్సవాలను నిర్వాహకులు స్కూల్ లో జరిగే అవార్డుల ఫంక్షన్ లా మార్చేసారు. కానీ గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రధానోత్సవం ప్రతి కుటుంబాన్ని టచ్ చేసే విధంగా ఉంటుందన్నారు.

English summary
Sanjeev Gupta's debut work Q has won the 2015 Gollapudi Srinivas Award. A citation and a prize money of Rs 1.5 lakhs will be given to the young director from Agra on Wednesday at Chennai.
Please Wait while comments are loading...