»   » రుద్రమదేవి: ‘గోన గన్నారెడ్డి’ కొత్త పోస్టర్

రుద్రమదేవి: ‘గోన గన్నారెడ్డి’ కొత్త పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా తరహాలోనే ‘రుద్రమదేవి' సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. రోజుకో పోస్టర్ చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో గణపతి దేవుడుగా నటించిన కృష్ణ రాజు, మహా మంత్రి శివదేవయ్యగా నటించిన ప్రకాష్ రాజ్ లుక్ విడుదల చేసారు.

తాజాగా ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లు అర్జున్ పోస్టర్ విడుదల చేసారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ పాత్ర పోషిస్తున్నారు. గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ పోషిస్తుండటంతో మెగా అబిమానులు కూడా సినిమా విడుదలకు ఎదురు చూస్తున్నారు.


Gona Ganna Reddy new poster

అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్ ఇలా ఎంతరో ప్రముఖ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. త్వరలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తుండటం మరో ఆసక్తికర అంశం.


గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Here's a poster for all the Stylish Fans out there ! #‎StylishStar AlluArjun‬ as "Gona Ganna Reddy " An outlaw, a bandit and a marauder!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu